కొత్తపల్లిలో వ్యక్తి దారుణ హత్య    | The Murder Of A Man In Kotha palli | Sakshi
Sakshi News home page

కొత్తపల్లిలో వ్యక్తి దారుణ హత్య   

Published Wed, Jun 13 2018 12:44 PM | Last Updated on Wed, Jun 13 2018 3:39 PM

The Murder Of A Man In Kotha palli - Sakshi

పెద్దవెంకట్‌రెడ్డి మృతదేహం

త్రిపురారం(నాగార్జునసాగర్‌) : అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం సా యంత్రం ఓవ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన అలుగుల పెద్దవెంకట్‌రెడ్డి (52)కి తన తమ్ముడు అలుగుల జంగారెడ్డి మధ్య ఆస్తి విషయంలో కొంతకాలంగా తగాదాలు జరుగుతున్నాయి. కొత్తపల్లి గ్రామ శివారులో ఉన్న రెండు ఎకరాల 24 గుంటల భూమి కొలతల్లో కొంత తేడాలు ఉండడంతో ఇరువురి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముడు అలుగుల జంగారెడ్డి తన భూమిని ఇటీవల రైతు తిరుపతయ్యకు అమ్ముకున్నాడు.

విషయం తెలుసుకున్న  అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి కొత్తపల్లి గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దల మాటలను పట్టించుకోకుండా జంగారెడ్డి రెండు రోజుల క్రితం తన భూమిని కొలత చేయిస్తుండగా అన్న పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడకు వెళ్లి తమ్ముడితో గొడవపడ్డారు. ఈనేపథ్యంలో తన అన్నపై తమ్ముడు జం గారెడ్డి కక్ష పెంచుకున్నాడు.ఈక్రమంలో మంగళవారం సాయంత్రం అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి గ్రామ శివారులోని పొలం వద్దకు వెళ్లాడు. విష యం తెలుసుకున్న  జంగారెడ్డి, మరి కొంతమంది వ్యక్తులతో కలిసి పొలం వద్దకు వెళ్లి అన్న పెద్ద వెంకట్‌రెడ్డిని కత్తులతో పొడిచి చంపాడు.  తీవ్ర  రక్తస్రావం అయి పెద్ద వెంకట్‌రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు.

దాడిచేసి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హత్య విషయం తెలుసుకున్న హలియా సీఐలు ధనుంజయగౌడ్, ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ ఘటన స్థలం వద్దకు చేరుకుని జరిగిన సంఘటనకు గల కారణాలను విచారించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఆస్తి కోసమే తన భర్తను మరిది జంగారెడ్డి హతమార్చారని మృతుడి భార్య కనకదుర్గ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement