
సురేంద్ర ఇంటి మందు గ్రామస్తులు
అలహాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జీన్స్ ప్యాంట్స్ కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. అలహాబాద్ బెహ్‌మాల్పుర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్ర, సురేంద్రలు అన్నదమ్ములు. ఇటీవల సురేంద్ర స్థానిక మార్కెట్‌లో రెండు జీన్స్ ప్యాంట్స్ కొనుక్కున్నాడు. ఈ ప్యాంట్ల విషయంలో అన్న రాజేంద్రతో చోటుచేసుకున్న చిన్న గొడవ సురేంద్ర ప్రాణాలను తీసింది. ఆగ్రహంతో రాజేంద్ర కత్తితో తమ్మునిపై దాడి చేసి పరారయ్యాడు. త్రీవ్రంగా గాయపడ్డ సురేంద్రను ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రకు నేర చరిత్ర ఉందని, కొద్ది రోజుల క్రితమే జైలు నుంచి విడుదలైనట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment