
వివాహేతర సంబంధాలు కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. క్షణకాలం తప్పిదాల కోసం మానవ సంబంధాలను మరిచిపోయి కొందరు దారుణంగా వ్యవహరిస్తున్నారు. అన్న భార్య అని కూడా చూడకుండా ఓ తమ్ముడు వివాహేతర సంబంధం కొనసాగించాడు. దీంతో, దారుణ హత్యకు గురయ్యాడు.
వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ధనంజయ్ (అలియాస్ పింటూ యాదవ్)కు ఈ ఏడాది ఏప్రిల్ 18న వివాహం జరిగింది. అనంతరం, ఇంట్లోనే వేరు కాపురం పెట్టారు. ఈ క్రమంలో ధనంజయ్ తమ్ముడు శివ బహదూర్.. అన్న భార్యతో చనువు పెంచుకున్నాడు. కాగా, అప్పుడప్పుడు శివ.. ఆమెతో చనువుగా ఉన్న సమయంలో అన్న పలుసార్లు మందలించాడు.
ఇదిలా ఉండగా.. అన్న మాటలను మాత్రం తమ్ముడు పట్టించుకోలేదు. దీంతో, ఆగ్రహంతో రగిలిపోయిన అన్న.. తన భార్యతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే అనుమానంతో తమ్ముడిని హత్య చేశాడు. ఈనెల 10న తన తమ్ముడు నిద్రిస్తుండగా పదునైన ఆయుధంతో దాడి చేసి చంపేశాడు. అనంతరం, అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా తన భార్యతో అక్రమ సంబంధం నడుపుతున్నాడనే అనుమానంతో అతడిని అంతమొందించానని అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment