
ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వనుము గురమ్మ
విజయనగరం, భోగాపురం: అనుమానంతో భార్యపై భర్త దాడిచేసిన సంఘటన మండలంలోని రాజాపులోవలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వనుము పాపయ్య, అతని భార్య గురమ్మల మధ్య రెండు రోజులుగా చిన్న చిన్న తగాదాలు జరుగుతున్నాయి. పాపయ్యకి తన భార్యపైన అనుమానం ఎక్కువగా ఉండడంతో ఆమెను పనికి పంపకుండా, తాను పనికి వెళ్ళకుండా ఇబ్బందులు పెడుతుండేవాడు. వీరికి ఏడేళ్ల వయసున్న బాబు.. ఐదేళ్ల వయసున్న పాప ఉన్నారు. అయి తే ఆదివారం ఏమైందో ఏమో వారిద్దరి మధ్య తగాదా మొదలైంది. ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో పాపయ్య తన భార్య గురమ్మపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఎస్సై ఉపేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment