సాక్షి, రంగారెడ్డి: నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో అతి దారుణంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగి పోలీస్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్ లక్ష్మీ నగర్ కాలనీ లోటస్ హిల్స్‌లో నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న షాలినిపై ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో పొడిచాడు. అనంతరం ఆ యువకుడు ఇంట్లో నుంచి పారిపోతుండగా అపార్టుమెంట్ అతన్ని పట్టుకొని నార్సింగి పోలీసులకు అప్పగించారు. ఆ యువతిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment