అనుమానం పెనుభూతం | Husband Knife Attack on Wife And Commits Suicide | Sakshi
Sakshi News home page

అనుమానం పెనుభూతం

Published Tue, Mar 12 2019 10:26 AM | Last Updated on Tue, Mar 12 2019 10:26 AM

Husband Knife Attack on Wife And Commits Suicide - Sakshi

కృష్ణారెడ్డి, పద్మజ (ఫైల్‌)

హస్తినాపురం: భార్యపై అనుమానంపై పెంచుకున్న ఓ వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయడమేగాకుండా తానూ కడుపులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, నకిరేకల్‌ మండలం, కొండారం గ్రామానికి చెందిన మారెడ్డి చెన్నక్రిష్ణారెడ్డి, భార్య పద్మజ దంపతులు వనస్థలిపురం, బీడీఎల్‌ కాలనీలోని నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు రాకేశ్, రాహుల్‌. పద్మజ టైలరింగ్‌ పనిచేస్తుండగా పెద్ద కుమారుడు రాకేశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు రాహుల్‌ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.

ఏ పని లేకుండా ఖాళీగా ఉండే చెన్నక్రిష్ణారెడ్డి  తరచూ భార్యను అనుమానించేవాడు. ఆమె ఎవరితో మాట్లాడినా  భార్యతో గొడవ పడేవాడు. దీంతో రెండేళ్లుగా పద్మ కుమారులతో కలిసి వేరుగా ఉంటోంది. సోమవారం పద్మజ హైకోర్టు కాలనీలో ఆలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి  వెళ్లివచ్చింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన క్రిష్ణారెడ్డి భార్యతో గొడవపెట్టుకున్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన అతను  మాంసం కోయడానికి ఉపయోగించే కత్తితో ఆమెపై దాడి చేశాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న పద్మజ పక్కింట్లోకి పారిపోయేందుకు ప్రయత్నించగా ఆమెను వెంబడించిన క్రిష్ణారెడ్డి కుట్టుమిషన్‌పై ఉన్న కత్తెరతో వెనుకనుంచి బలంగా పొడవడంతో కుప్పకూలింది. అనంతరం అతను తన చేతిలో ఉన్న కత్తితో కడులో పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన  స్థానికులు 100 నంబర్‌కు  సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement