
కత్తితో దాడి చేస్తున్న వ్యక్తి
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఆఫీసర్స్ లైన్ వద్ద శుక్రవారం రాత్రి ఇద్దరు వ్యక్తులు గొడవపడడం స్థానికంగా కలకలం రేపింది. ఇందులో ఒకతను ‘నేను నాని అనుచరుడిని రా.. నాపై తొమ్మిది కేసులున్నాయి, నిన్ను నరికేస్తే పదో కేసు అవుతుంది’’ అంటూ ఎదురుగా ఉన్న వ్యక్తిని కత్తితో నరికాడు.
తలకు తీవ్ర గాయమైన వ్యక్తిని రోడ్డుపైనే కొడుతూ, కత్తితో నరకడానికి ప్రయత్నించగా మరికొందరు అడ్డుపడ్డారు. చివరకు సమాచారం అందుకున్న బ్లూకాట్ పోలీసులు ఇద్దరినీ అడ్డుతీసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల ఎదుటే నాని అనుచరుడిని అంటూ చెప్పుకున్న వ్యక్తి మళ్లీ దాడికి ప్రయత్నించాడు. కాగా కత్తితో నరికిన వ్యక్తి జానకారపల్లెకు చెందినవాడిగా, గాయపడ్డ వ్యక్తి సీఎంటీ రోడ్డుకు చెందిన యువకుడిగా తెలిసింది. గాయపడ్డ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment