
సంఘట స్థలంలో వివరాలు సేకరిస్తున్న ఎల్విన్‌పేట సీఐ రమేష్ కుమార్
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: శాస్త్రసాంకేతిక విజ్ఞానం ఎంతగానో విస్తరిస్తోంది. సోషల్‌మీడియా ద్వారా మరెన్నో విషయాలపై అవగాహన పెంచుకుంటున్నారు. అయినా ఇంకా మూఢనమ్మకాల ప్రభావం మాత్రం అక్కడ కనిపిస్తూనే ఉంది. చేతబడి... చిల్లంగి... వంటి అనుమానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే అనుమానంతో తోటివ్యక్తిని గాయపర్చి... ఆయన మరణానికి కారణమైన సంఘటన ఒకటి మంగళవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్‌పేట సీఐ రమేష్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని డుమ్మంగి పంచాయతీ టెంకసింగి గ్రామానికి చెందిన కొండగొర్రి ప్రకాష్ బామ్మర్ది శంకరరావుకు గడచిన మూడు నెల లుగా అరోగ్యం బాగుండటం లేదు. ఆస్పత్రు ల చుట్టూ తిప్పినా ఫలితం కానరాలేదు. దీని కంతటికీ కారణం గ్రామానికి చెందిన తోయక నరసింహులు(55) అనే వ్యక్తి చేతబడి చేయడమేనని అనుమానించిన ప్రకాష్ ఆయనపై ప్రతీకారం తీర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మంగళవారం ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో గ్రామం బయట ప్రధాన రహదారిలో కాపు కాసి... అటుగా వచ్చిన నరసింహులుపై కర్రతో దాడిచేశాడు. ఆయన కిందపడిపోవడంతో అదే అదనుగా భావించి ఇంటికి వెళ్లి ఓ కత్తిపట్టుకొని వచ్చి తల భాగంపై దాడిచేయగా నరసింహులు కుప్పకూలిపోయాడు.
అడ్డుకునేందుకు యత్నించిన నరసింహులు భార్య ఆరాలు, పెద్ద కొడుకు సురేష్‌పైనా ప్రకాష్ కత్తితో దాడి చేసి, గ్రామస్తులు గమనించి వచ్చేలోగా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై స్పృహ లేకుండా పడి ఉన్న నరసింహులును కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యం నిమిత్తం భద్రగిరి సీహెచ్‌సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరసింహులు మృతి చెందాడు. ఆయన భార్య ఆరాలు చేతికి కత్తి గాయాలు కావడంతో ఆమెను ఏరియా ఆస్పత్రిలో, కొడుకు సురేష్‌కు మెడపై గాయమవ్వటంతో భద్రగిరి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, శవపంచనామా, పోస్టుమార్టం అనంతరం నరసింహు లు మృతదేహాన్ని స్వగ్రా>మానికి తరలిస్తామ ని సీఐ తెలిపారు. నరసింహులుకు సురేష్‌తో పాటు మరో కొడుకు విజయ్, కూతురు కళ్యాణి ఉన్నారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన గ్రామంలో మంగళవారంచోటు చేసుకున్న ఈ సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment