నిప్పురవ్వ పడిందని కత్తితో దాడి | Knife Attack On Man While Blasting Crackers In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నిప్పురవ్వ పడిందని కత్తితో దాడి

Published Fri, Nov 9 2018 5:54 AM | Last Updated on Sat, Nov 10 2018 1:14 PM

Knife Attack On Man While Blasting Crackers In Visakhapatnam - Sakshi

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): బాణసంచా నిప్పు రవ్వ పడిందన్న నెపంతో ఒక యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచాడు. ఎంవీపీ స్టేషన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదజా లారిపేట కాలనీలో దీపావళి సందర్భంగా బుధవారం రాత్రి యువకులు రోడ్లపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో అక్కడి ఆటోడ్రైవర్‌ చందనాల దాసు(30) కాల్చిన బాణసంచాకి సం బంధించిన నిప్పు రవ్వలు సమీపంంలోనే ఉన్న మదుపాన శ్రీనివాస్‌పై పడ్డాయి. దీంతో ఆగ్రహించిన శ్రీను తన వద్ద ఉన్న కత్తితో దాసు కడుపులో పొడిచాడు.

స్థానికుల ఫిర్యాదు మేరకు దాసుని హుటాహుటిన 108అంబులెన్సులో కేజీ హెచ్‌కి తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఈ ఇద్ద రు యువకుల కుటుంబాల మధ్య గొడవ జరి గింది. పది రోజుల క్రితం నిందితుడు శ్రీను సోదరుడు రాజుకి జ్వరం రావడంతో దాసు తండ్రి సత్తయ్య చేతబడి చేశాడంటూ అతని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీను పాత గొడవ మనసులో ఉంచుకునే బాణసంచా నెపంతో దాడి చేశాడని పోలీసుల విచారణలో తేలింది. దాసు సోదరుడు పోలారావు ఫిర్యాదు మేరకు ఎంవీపీ సీఐ కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ ఐ.గోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement