
క్యూబెక్ : నగరంలోని రీజినల్ పార్లమెంట్ భవనం దగ్గరలో కత్తి దాడికి పాల్పడ్డాడో దుండగుడు. ఈ కత్తిదాడిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం కెనడాలోని, క్యూబెక్ నగర పార్లమెంట్ భవనం దగ్గరలో పురాతన కాలపు వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి జనంపై కత్తి దాడికి పాల్పడ్డాడు. పొడవాటి కత్తి సహాయంతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం పరారీలో ఉన్న దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ( బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని.. )
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ‘‘ ఆదివారం ఉదయమే అతడ్ని అదుపులోకి తీసుకున్నాము. దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు తలుపులు బిగించుకుని ఇళ్లలోనే ఉండండ’’ని హెచ్చరించారు. కాగా, కెనడా వ్యాప్తంగా గత కొద్దిరోజుల నుంచి హాలోవీన్ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో దుండగుడి విచిత్ర వేషధారణను ప్రజలు అంతగా పట్టించుకోలేదు. దీంతో దాడి చేయటం అతడికి సులభమైంది.