గాయపడిన అప్పలరాజు
దుండిగల్: పీఎఫ్ డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నాడన్న కోసంతో ఓ కార్మికుడిపై సహోద్యోగి వేట కొడవలితో దాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ వెంకట్రామ్‌నగర్‌కు చెందిన అప్పలరాజు మేడ్చల్‌లోని క్వాలిటిక్స్ ఫార్మా పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన సుబ్బారావు సైతం అదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే సుబ్బారావుకు పీఎఫ్ రాకుండా అప్పలరాజు అడ్డుపడుతున్నాడని అతడిపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం అప్పలరాజు బైక్‌పై సూరారం నుంచి మేడ్చల్‌కు వెళ్తుండగా దుండిగల్ మున్సిపల్ కార్యాలయం దారిలో కాపు కాసిన సుబ్బారావు అతడిని అడ్డుకుని వేట కొడవలితో దాడి చేయడంతో అప్పలరాజు చేతులు, భుజంపై తీవ్రగాయాలయ్యాయి. దీనిని గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోగా నిందితుడు పరారయ్యాడు. అప్పల రాజు ను సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment