colleague attacks
-
అందరూ చూస్తుండగానే ప్రాణాలు తీశాడు..
తడ : వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో.. అందరూ చూస్తుండగానే సహోద్యోగిని కత్తెరతో విచక్షణ రహితంగా పొడిచేశాడు. తిరుపతి జిల్లా తడ మండల పరిధిలోని మాంబట్టు ప్రభుత్వ పారిశ్రామిక వాడలోని అపాచీ బూట్ల పరిశ్రమల్లో శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు.. చిట్టమూరు మండలం కుమ్మరిపాళేనికి చెందిన వెంకటాద్రి.. అదే గ్రామానికి చెందిన ఎర్రబోతు వనజ(28)ను ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. కాగా, బురదగాలి గ్రామానికి చెందిన మీజూరు సురేష్(23) కుమ్మరిపాళేనికి వచ్చి స్థిరపడ్డాడు. అక్కడి నుంచే అపాచీలో పనికి వెళ్తున్నాడు. కొంత కాలంగా వనజను వేధించడం మొదలెట్టాడు. ఈ విషయంపై 2019, 2021లో చిట్టుమూరు పోలీస్ట్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఇంకా కేసు నడుస్తోంది. తాజాగా శుక్రవారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనానికి వెళ్లిన వనజను అక్కడ మళ్లీ వేధించాడు. దీంతో ఆమె సురేష్‌ను తీవ్రంగా మందలించింది. ఆవేశానికి గురైన సురేష్ అక్కడే ఉన్న కత్తెర తీసుకుని వనజ మెడ, శరీరంపై పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ వనజ అక్కడే కుప్పకూలిపోగా.. తోటి కార్మికులు సూళ్లూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. నిందితుడిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ కొండపనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పీఎఫ్ రాకుండా అడ్డుకున్నాడని..
దుండిగల్: పీఎఫ్ డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నాడన్న కోసంతో ఓ కార్మికుడిపై సహోద్యోగి వేట కొడవలితో దాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ వెంకట్రామ్‌నగర్‌కు చెందిన అప్పలరాజు మేడ్చల్‌లోని క్వాలిటిక్స్ ఫార్మా పరిశ్రమలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. సూరారం రాజీవ్ గృహకల్పకు చెందిన సుబ్బారావు సైతం అదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అయితే సుబ్బారావుకు పీఎఫ్ రాకుండా అప్పలరాజు అడ్డుపడుతున్నాడని అతడిపై కక్ష పెంచుకున్నాడు. సోమవారం అప్పలరాజు బైక్‌పై సూరారం నుంచి మేడ్చల్‌కు వెళ్తుండగా దుండిగల్ మున్సిపల్ కార్యాలయం దారిలో కాపు కాసిన సుబ్బారావు అతడిని అడ్డుకుని వేట కొడవలితో దాడి చేయడంతో అప్పలరాజు చేతులు, భుజంపై తీవ్రగాయాలయ్యాయి. దీనిని గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకునేలోగా నిందితుడు పరారయ్యాడు. అప్పల రాజు ను సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. -
సహాద్యోగి దాడితో యువకుడి మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు సహచర ఉద్యోగుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మెలియపుట్టి మండలం జాడుపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అల్లా అచ్యుతరావు (32), గోస నాగేశ్వరరావు (60) వీరిద్దరూ ఒకే సంస్థలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం గ్రామంలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలోనే నాగేశ్వరరావు రాయితో అచ్యుతరావుపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.