శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు సహచర ఉద్యోగుల మధ్య ఘర్షణలో ఒకరు మృతి చెందారు. మెలియపుట్టి మండలం జాడుపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అల్లా అచ్యుతరావు (32), గోస నాగేశ్వరరావు (60) వీరిద్దరూ ఒకే సంస్థలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. మంగళవారం గ్రామంలో వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ సమయంలోనే నాగేశ్వరరావు రాయితో అచ్యుతరావుపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.