ఒంగోలు: ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం రేణంగివరం వద్ద లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో 19 మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అద్దంకి ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. శబరిమలలో అయ్యప్ప దర్శనం అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఇద్దరు డ్రైవర్లు గుర్తించకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.