
సాక్షి, కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తితో బాలిక గొంతు కోసి అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. కర్నూలులోని రాక్‌వుడ్ హైస్కూల్‌కు చెందిన హిందీ పండిట్ శంకర్ అదే పాఠశాలకు చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిపై శనివారం ఉదయం దాడి చేశారు.
మద్యం మత్తులో బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో బాలిక గొంతు కోశారు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. బాలిక కేకలు విని స్థానికులు ఇంట్లోకి వచ్చి శంకర్‌ను అడ్డుకున్నారు. తర్వాత అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచరం. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment