hindhi teacher
-
దారుణం : విద్యార్థినిపై టీచర్ కత్తి దాడి
సాక్షి, కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కత్తితో బాలిక గొంతు కోసి అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. కర్నూలులోని రాక్‌వుడ్ హైస్కూల్‌కు చెందిన హిందీ పండిట్ శంకర్ అదే పాఠశాలకు చెందిన ఓ తొమ్మిదో తరగతి విద్యార్థినిపై శనివారం ఉదయం దాడి చేశారు. మద్యం మత్తులో బాలిక ఇంట్లోకి చొరబడి కత్తితో బాలిక గొంతు కోశారు. అనంతరం తాను గొంతు కోసుకున్నాడు. బాలిక కేకలు విని స్థానికులు ఇంట్లోకి వచ్చి శంకర్‌ను అడ్డుకున్నారు. తర్వాత అతన్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచరం. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు చెబుతున్నారు. -
విద్యార్థి కన్నుమీద బెత్తం దెబ్బ
శ్రీకాకుళం, కొత్తూరు: పాఠశాలల్లో బెత్తాలు వినియోగించి విద్యాబోధన చేయవద్దని చట్టాలు చెప్పుకొస్తున్నాయి. కానీ ఆ పాఠశాలలో బెత్తం ఉపయోగించి విద్యాబోధన చేయడంతో ఓ విద్యార్థి కన్ను మీద బెత్తం దెబ్బ పడటంతో అతడి కన్ను ప్రమాదకరంగా మారింది. బాధిత విద్యార్థి చెప్పిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మాతల జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాతల గ్రామానికి చెందిన మజ్జి బాబూరావు పదో తరగతి చదువుతున్నాడు. గ్రామంలో ఆదివారం రాత్రి వినాయక నిమజ్జనం చేయడంతో బాబూరావు సోమవారం పాఠశాలకు సెలవు పెట్టి మంగళవారం వెళ్లాడు. సోమవారం పాఠశాలకు ఎందుకు రాలేదని పాఠశాలలో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయురాలు కామేశ్వరి బెత్తంతో బాబూరావును కొట్టింది. బెత్తం దెబ్బ బాబూరావు కుడికన్ను మీద బలంగా తగలడంతో కన్ను వాపురావడంతో పాటు ఎరుపు రంగుగా మారింది. ఆ సమయంలో పాఠశాల చివరి పీరియడ్ కావడం, అందుబాటులో హెచ్ఎం భాస్కరరావు లేకపోవడంతో విద్యార్థి నేరుగా ఇంటికి వచ్చి అన్నయ్య రాజేశ్వరరావుకు జరిగిన విషయాన్ని వివరించాడు. పాఠశాల సమయం పూర్తికావడంతో ఉపాధ్యాయురాలిని అడగలేక పోయామని చెప్పారు. పాఠశాలకు ఐదుగురు సెలవు పెట్టారని, అందరికీ బెత్తంతో కొట్టినప్పటికీ నాకు మాత్రం బలంగా ఉపాధ్యాయురాలు కొట్టారని బాబూరావు వివరించాడు. కంటి మీద కొట్టడంతో ఆందోళన కలిగిస్తుందని విద్యార్థి అన్నయ్య తెలిపాడు. ఏ రోజు కూడా తన తమ్ముడు బాబూరావు పాఠశాలకు సెలవు పెట్టి ఇంటి దగ్గర ఉండలేదన్నారు. పిల్లలను బెదిరించాలి తప్ప ఈ విధంగా కొట్టడం బాధాకరంగా ఉందన్నారు. కాగా, ఈ విషయంపై ఉపాధ్యాయురాలు కామేశ్వరిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు అందుబాటులో లేకపోవడంతో పాటు సెల్ ఫోన్‌కు ఫోన్ చేసిన లిఫ్టు చేయకపోవడంతో హెచ్ఎం భాస్కరరావు వద్ద ప్రస్తావించగా సంఘటన జరిగిన సమయంలో తాను పాఠశాలలో లేనని చెప్పారు. జరిగిన సంఘటనపై ఉపాధ్యాయురాలు, బాధిత విద్యార్థి తనకు తెలపలేదని అన్నారు. -
చల్లపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
చల్లపల్లి(కృష్ణా జిల్లా): చల్లపల్లి మండలం రామనగరం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్కూటీపై వెళ్తున్న క్రిష్ణ కుమారి(40)ని ఎదురుగా వస్తోన్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనలో ఆమెతో పాటు ఉన్న నాగ ప్రవల్లిక(7) అనే చిన్నారి కూడా మరణించింది. కోడూరు మండలం వి.కొత్తపాలెంలో క్రిష్ణ కుమారి హిందీ టీచర్‌గా పని చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గురువా.. నీకిది తగునా!
పెద్దపంజాణి: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం పెద్దపంజాణి మండలంలోని రాయలపేట ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థుల కథనం మేరకు.. రాయలపేట ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు శ్రీరాములు కొంత కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఏడాది క్రితం ఈ విషయం గమనించిన ప్రధానోపాధ్యాయుడు అత న్ని మందలించారు. మార్పు రాలేదు. ఆరు నెలలుగా తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించేవాడు. వేధిం పులు భరించలేక ఆ అమ్మాయి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. పాఠశాలకు వెళ్లనని మొండికేసింది. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. శనివారం పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులు సదరు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయాన్ని హెచ్ఎం నారాయణ డీఈవో ప్రతాప్‌రెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. పెద్దపంజాణి ఎంఈవో వెంకట్రమణ విచారణ చేపట్టారు. అతను వేధింపులకు పాల్పడింది నిజమేనని, అతనికి మరో ముగ్గురు ఉపాధ్యాయులు సహకరించారని విద్యార్థి తల్లిదండ్రులు, స్థానికులు ఎంఈవోకు తెలియజేశారు. ఎంఈవో నివేదిక మేరకు సదరు హిందీ ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగిస్తూ డీఈవో ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. దీనిపై సోమవారం క్షేత్రస్థాయి విచారణ చేపడతామని, అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. అదే పాఠ శాలకు చెందిన ఇంగ్లిషు టీచర్ అక్బర్ హుస్సేన్ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఉపాధ్యాయులకు ఎంఈవో క్లాస్.. పాఠశాలలో ఆరు నెలలుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఉపాధ్యాయులపై ఎంఈవో వెంకట్రమణ మండిపడ్డారు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని హితబోధ చేశారు.