చల్లపల్లి(కృష్ణా జిల్లా): చల్లపల్లి మండలం రామనగరం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. స్కూటీపై వెళ్తున్న క్రిష్ణ కుమారి(40)ని ఎదురుగా వస్తోన్న టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది.
ఈ ఘటనలో ఆమెతో పాటు ఉన్న నాగ ప్రవల్లిక(7) అనే చిన్నారి కూడా మరణించింది. కోడూరు మండలం వి.కొత్తపాలెంలో క్రిష్ణ కుమారి హిందీ టీచర్‌గా పని చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చల్లపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
Published Tue, Aug 2 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
Advertisement
Advertisement