
హేమలత (ఫైల్)
శ్రీకాకుళం, పాతపట్నం: మెళియాపుట్టి మండలం వెంకటాపురం పంచాయతీ బందపల్లి గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం తన ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుని సవర హేమలత (25) ఆత్మహత్య చేసుంది. పోలీసులు, గ్రామస్తులు వివరాల ప్రకారం... ఆమె తండ్రి సవర పాపయ్య, తల్లి జానకమ్మ పోడు వ్యవసాయం కోసం కొండపైకి వెళ్లారు. ఇంతలో ఈ దారుణానికి ఒడిగట్టింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ సిద్ధార్థ కుమార్ చేరుకుని పరిశీలించి, మృతురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. హేమలత ఇంటర్ వరకు చదువుకుంది. తమ్ముడు అనిల్ ఉన్నాడు. పోస్టుమార్టం కోసం పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.