
గుడిసె దగ్ధమైన దృశ్యం
బుచ్చిరెడ్డిపాళెం: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటల కారణంగా టి.చెంచమ్మ అనే వృద్ధురాలు సజీవదహనమైన సంఘటన మండలంలోని పెనుబల్లిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామంలోని కోవూరు కాలువ పక్కనే టి.చెంచమ్మ(82) నివాసముంటోంది. కుమారుడు సుబ్బయ్య భోజన వసతి సమకూర్చుతుడంతో కాలం గడుపుతోం ది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చి చూడగా కళ్లముందే గుడిసె మొత్తం తగలబడిపోయింది. గుడిసెలో ఉన్న చెంచమ్మ సజీవదహనమైంది. అక్కడి పరిసరాలను పరిశీలించగా విద్యుత్ తీగలు తెగి పడి ఉన్నాయి. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment