తల్లీకూతురు సజీవ దహనం | Mother And Daughter Commits Suicide in Ballari | Sakshi
Sakshi News home page

తల్లీకూతురు సజీవ దహనం

Published Tue, Jan 7 2020 8:43 AM | Last Updated on Tue, Jan 7 2020 8:43 AM

Mother And Daughter Commits Suicide in Ballari - Sakshi

ఘటన స్థలంలో ఫైర్‌ సిబ్బంది

సాక్షి, బళ్లారి: తల్లీకూతుళ్ల కిరోసిన్‌ పోసుకుని నిప్పుటించుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం బళ్లారి తాలూకా సంజీవరాయనకోట ఎస్‌సీకాలనీలో నివాసం ఉంటున్న తల్లి పార్వతమ్మ(60), కూతురు హులిగమ్మ(35) కుటుంబ సమస్యలతో జీవితంపై విరక్తి చెంది కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు గమనించేలోగా ఇద్దరూ సజీవ దహనం అయ్యారు. ఇంట్లో నుంచి పొగలు, మంటలు రావడంతో చుట్టుపక్కల వారు ఫైర్‌ సిబ్బందికి ఫోన్‌ చేశారు. మంటలను ఆర్పేందుకు యత్నించగా అప్పటికే తీవ్రగాయాలతో ఇద్దరు మృతి చెందారు. 

పిల్లలు పుట్టలేదని చింత   
పార్వతమ్మ కుమార్తెను అదే గ్రామానికి చెందిన వ్యక్తితో 20 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. తన కుమార్తెకు సంతానం కలగలేదని తల్లి బాధపడేది. భర్త పని మీద వేరే ఊరికి వెళ్లాడు. ఈ సమయంలో తల్లీకూతుళ్లు ఇద్దరూ కిరోసిన్‌ పోసుకుని నిప్పటించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామీణ పోలీసులు అక్కడకి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. కాగా, మొదట గ్యాస్‌ సిలిండర్‌ పేలి మరణించారని ప్రచారం జరిగింది. పోలీసులు వచ్చిన పరిశీలించగా వారే నిప్పంటించుకున్నట్లు తేలింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement