
కృష్ణరాజపురం: సమాజంలో మహిళలు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో జీవనం సాగిస్తున్నారు. ఇందుకు భిన్నంగా ఇద్దరు పిల్లలున్న ఓ మహిళ చిన్న కారణానికి క్షణికావేశంలో చేజేతులా జీవితాన్ని అంతం చేసుకుంది. భర్త చాక్లెట్ తేలేదని ఉరి వేసుకుంది. ఈ ఘటన నగరంలో హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెణ్ణూరులో నందిని (30) అనే మహిళ తన భర్తతో కలిసి నివాసం ఉంటోంది.
వీరికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త సెలూన్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం భర్త సెలూన్‌కు వెళ్లే సమయంలో తనకు చాక్లెట్ తేవాలని కోరింది. అతను ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. దీంతో నందిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త మధ్యాహ్న సమయంలో ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. హెణ్ణూరు పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment