రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. | Married Women Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

May 15 2019 7:23 AM | Updated on May 15 2019 7:23 AM

Married Women Commits Suicide in Karnataka - Sakshi

పుష్పలత మృతదేహం , పుష్పలత (ఫైల్‌)

కన్నడ భాషా సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండే ఆమె ప్రాణాలు తీసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది.

దొడ్డబళ్లాపురం: ఇంట్లో ఉరివేసుకుని వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  పుష్పలత (35)ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ. తాలూకాలోని మజరాహొసహళ్లి గ్రామం నివాసి పుట్టరాజు భార్య పుష్పలత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కన్నడ భాషా సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండే ఆమె ప్రాణాలు తీసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. భర్త పుట్టరాజు పారిశ్రామికవాడలోని ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. తను అభిమానించే స్థానిక ప్రముఖ వ్యక్తి ఆదివారం మృతి చెందడంతో కలత చెందిన పుష్పలత ఆత్మహత్య చేసుకుందని కొందరు చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement