pushpalatha
-
భార్య భోజనం వడ్డించలేదని.. తల నరికి, చర్మం ఒలిచి..!
తుంకూర్: భోజనం వడ్డించ లేదని భార్యతో తగవుపెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలి చేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా కునిగల్ తాలుకాలోని హళియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. శివరామ, పుష్పలత(35)లకు పదేళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. శివరామ కోత మిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు. ఇద్దరిమధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తలనరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు పక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూర్ ఎస్పీ అశోక్ వెంకట్ గురువారం తెలిపారు. -
దారుణం: భార్య గొంతునులిమి.. పసికందు ముక్కు మూసి
సాక్షి, గార్లదిన్నె (అనంతపురం): అదనపు కట్నం తీసుకురాలేదన్న అక్కసుతో భార్యను, మూడు నెలల పసికందును హతమార్చిన ఘటన గార్లదిన్నె మండలం కల్లూరులో ఆదివారం వేకువజామున చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం సంకలాపురం గ్రామానికి చెందిన వెంకటేశులు, వెంకటేశ్వరమ్మ పెద్ద కుమార్తె పుష్పలత (24)ను గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన కుమ్మర తరుణ్‌కుమార్‌కు ఇచ్చి 2020 డిసెంబర్ 24న వివాహం జరిపించారు. కట్న కానుకల కింద 30 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఇచ్చారు. తరుణ్‌కుమార్ కల్లూరులో రైస్ మిల్లు నిర్వహించడంతో పాటు ఇటుకల వ్యాపారం కూడా చేస్తున్నాడు. పుష్పలతకు మూడు నెలల క్రితం ఆడబిడ్డ జన్మించింది. అప్పటి నుంచి అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. ఆడబిడ్డ పుట్టిందని సూటిపోటి మాటలు అనడంతో పాటు మరింత కట్నం తేవాలంటూ పుష్పలతను భర్త, అత్త, మామ వేధించేవారు. చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..) ఆమె పది రోజుల క్రితం పసిబిడ్డతో కలిసి అత్తారింటికి వచ్చింది. రెండు రోజుల క్రితం పామిడి సంగమేశ్వర ఆలయంలో అభిషేకం చేయించి పాపకు మోక్షిత అని పేరు పెట్టారు. అయితే.. ఆదివారం తెల్లవారుజామున ఇంటి పైగదిలో పుష్పలత, చిన్నారి మోక్షిత విగతజీవులై కనిపించారు. ఈ విషయమై స్థానికుల నుంచి సమాచారం అందడంతో డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ శివశంకర్ నాయక్, ఎస్ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పుష్పలత తండ్రి వెంకటేశులు ఫిర్యాదు మేరకు భర్త తరుణ్‌కుమార్, మామ ఓబిలేసు, అత్త లక్ష్మిదేవి, ఓబిలేసు చిన్నల్లుడు హరిపై కేసు నమోదు చేసి.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భార్య పుష్పలతను గొంతు నులిమి హతమార్చినట్లు, పసికందు ముక్కును మూసి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు తరుణ్‌కుమార్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. రూ.50 లక్షలివ్వాలని వేధించారు.. అప్పులు తీర్చేందుకు రూ.50 లక్షలు తీసుకురావాలని తన కుమార్తెకు పదేపదే ఫోన్ చేసి అత్తింటివారు వేధించారని మృతురాలి తండ్రి వెంకటేశులు ఆరోపించారు. తాము కూడా అప్పుల్లో ఉన్నప్పటికీ కూతురి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మరో రూ.20 లక్షలు ఇచ్చామని తెలిపారు. అయినా అత్తింటి వేధింపులు ఆగలేదని, మిగిలిన డబ్బు తేవాలని ఒత్తిడి చేసేవారని వివరించారు. తన పరిస్థితి బాగోలేకపోవడంతో ఇక డబ్బివ్వలేనని చెప్పానని, దీంతో కూతుర్ని, ఆస్తికి అడ్డొస్తుందన్న కారణంతో మనుమరాలిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారని తెలిపారు. -
రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
దొడ్డబళ్లాపురం: ఇంట్లో ఉరివేసుకుని వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ గ్రామీణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పుష్పలత (35)ఆత్మహత్య చేసుకున్న వివాహిత మహిళ. తాలూకాలోని మజరాహొసహళ్లి గ్రామం నివాసి పుట్టరాజు భార్య పుష్పలత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కన్నడ భాషా సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండే ఆమె ప్రాణాలు తీసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. భర్త పుట్టరాజు పారిశ్రామికవాడలోని ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. తను అభిమానించే స్థానిక ప్రముఖ వ్యక్తి ఆదివారం మృతి చెందడంతో కలత చెందిన పుష్పలత ఆత్మహత్య చేసుకుందని కొందరు చెబుతున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అచ్చం అభిమన్యుడు సినిమాలోలాగే..
సాక్షి, కర్నూలు : హిరో విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. డిజిటల్ క్రైమ్‌లో మనకు తెలియకుండానే ఎలా చిక్కుకుంటున్నామో ఆ సినిమాలో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మనకు తెలియకుండానే మన బ్యాంక్ ఖాతాలోనుంచి డబ్బు డ్రా చేసుకుంటారు. అచ్చం అలాంటి ఘటననే కర్నూలు జిల్లాలో ఒకరికి జరిగింది. ఆమెకు తెలియకుండానే తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు సైబర్ నేరస్తులు. జిల్లాలోని బనగానపల్లే పట్టణం పంచమపేటకు చెందిన పుష్పలతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఖాతా ఉంది. గత నెలలో ఆమెకు తెలియకుండానే తన ఖాతాలో నుంచి రూ.61,110 గుర్తుతెలియని వక్తులు డ్రా చేసుకున్నారు. దీంతో ఆ మహిళ బ్యాంక్‌కు వెళ్లి అధికారులను సంప్రదించారు. ఆమె ఖాతా వివరాలు పరిశీలించగా అసలు విషయాలు బయటపడ్డాయి. బ్యాంక్ అధికారులు పుష్సలత అకౌంట్‌కు వేరే వ్యక్తి ఆధార్‌తో లింకేజ్ చేశారు. దీంతో సైబర్ నేరస్తులు వేలి ముద్రల సహాయంతో డబ్బులు డ్రా చేసుకున్నారు. గత 25 రోజుల నుంచి బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని పుష్సలత ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్ అధికారులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారని వాపోయారు. చేసేది ఏమి లేక చివరకి మీడియాను సంప్రదించానని తెలిపారు. బాధితురాలి తరపున వివరణ అడగడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై బ్యాంక్ మేజేజర్ దురుసుగా ప్రవర్తించడం గమనార్హం. -
వివాహేతర సంబంధం నేరం కాదనడంతో..
చెన్నైలోని భారతీనగర్‌కు చెందిన పుష్పలత రెండేళ్ల క్రితం జాన్‌పాల్ ఫ్రాంక్లిన్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఈ పెళ్లిని ఇద్దరి కుటుంబాలూ వ్యతిరేకించాయి. దీంతో వీరిద్దరు వేరేచోట కాపురం పెట్టారు. వీరికి ఓ సంతానం కూడా కలిగింది. చెన్నైలోని ఓ పార్కులో ప్రస్తుతం ఫ్రాంక్లిన్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్నాడు. భార్య పుష్పలతకు క్షయవ్యాధి సోకడంతో ఆమె ప్రస్తుతం చికిత్సపొందుతోంది. వ్యాధిసోకిన నాటి నుంచీ భార్యతో అన్యోన్యంగా ఉండటం మానేసిన ఫ్రాంక్లిన్.. ఆమెకు కనీస అవసరాలకు సైతం డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఈ విషయాన్ని అతని స్నేహితులకు చెప్పడానికి పుష్పలత వెళ్లినపుడు ఫ్రాంక్లిన్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్నేహితులు చెప్పారు. పార్కులో సెక్యూరిటీ గార్డు డ్యూటీ సమయం పూర్తయినా చాలా లేటుగా ఇంటికొస్తున్న భర్తను నిలదీసింది. ఆ మహిళతో వివాహేతర బంధాన్ని తెంచుకోవాలని తెగేసిచెప్పింది. అందుకు ఫ్రాంక్లిన్ తిరస్కరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. వివాహేతర బంధాలు నేరం కాదంటూ తాజాగా సుప్రీంకోర్టు తీర్పుచెప్పిందని, పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమే లేదంటూ ఫ్రాంక్లిన్ సమర్థించుకున్నాడు. దీంతో తీవ్ర నిరాశకు గురైన పుష్పలత శనివారం ఒంటరిగా ఉన్నపుడు ఉరి వేసుకుని ఆత్మహత్యచేసుకుంది. విషయం తెల్సిన పోలీసులు ఫ్రాంక్లిన్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తుచేస్తున్నారు. భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని 497వ సెక్షన్ కింద వివాహేతర (ఇరువురి సమ్మతితో) సంబంధాలు నేరం కాదని తాజాగా సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన తొలికేసుగా పుష్ప మరణాన్ని పరిగణిస్తున్నారు. అయితే ఐపీసీ సెక్షన్ 306 ప్రకారం.. ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎలాంటి వివాహేతర సంబంధమైనా శిక్షార్హమైన నేరమే అవుతుంది. -
బాబును నమ్మి మోసపోయాం..
ఆళ్లగడ్డ: ‘ఎన్నికల సమయంలో వాల్మీకులందరినీ ఎస్టీల జాబితాల్లో చేరుస్తామని చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం’ అన్నా అని వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి మహిళా విభాగం నాయకురాలు, ఎంపీటీసీ పుష్పలత వైఎస్‌జగన్‌తో అన్నారు. మంగళవారం బేతంచర్లకు పాదయాత్రగా చేరుకున్న వైఎస్ జగన్‌కు ఆమె వాల్మీకి సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ‘వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు తాము నాలుగేళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నా చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి’ అని ఆమె వైఎస్జగన్ను కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ దీనిపై విచారించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా నాయకులు భువనేశ్వరి, సులోచన, నాగజ్యోతి తదితరులు ఉన్నారు. -
మనోవేదనతో మహిళ ఆత్మహత్య
= విదేశీ ఉద్యోగం పేరుతో మోసపుపెళ్లి... = ఎంత సర్దుకున్నా సజావుగా సాగని సంసారం = భర్త వేధింపులతో జీవితంపై విరక్తి = ఉరేసుకుని భార్య ఆత్మహత్య = పుణే పోలీసుల అదుపులో భర్త సొరకాయలపేట (పామిడి) : ఎంత సర్దుకున్నా సంసారం సజావుగా సాగకపోవడానికి తోడు నువ్వు చస్తేగానీ నాకు మనశ్శాంతి ఉండదంటూ భర్త వేధించడం తాళలేని ఓ మహిళకు జీవితంపై విరక్తి కలిగింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితుల కథనం మేరకు... పామిడి మండలంలోని సొరకాయలపేట గ్రామానికి చెందిన కల్లు పెద్ద లక్ష్మినారాయణ, కల్లు లక్ష్మిదేవి దంపతుల కుమారుడు కల్లు అంజ¯ŒSకుమార్‌యాదవ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పడంతో గుత్తి ఆర్ఎస్కు చెందిన వితంతువు ఎస్.గురులక్షీ్మదేవి ఎంబీఏ చదివిన తన పెద్ద కుమార్తె ఎస్.పుష్ఫలత(25)ను ఇచ్చి పెళ్లి చేసింది. కట్నకానులక కింద రూ.5లక్షలు, 18 తులాల బంగారం ఇచ్చింది. పెళ్లయిన తర్వాత అంజ¯ŒSకుమార్ ఆస్ట్రేలియా తీసుకెళ్తానని చెప్పి భార్యను పుణే తీసుకెళ్లి ఒక అపార్ట్మెంట్లో అద్దెకు దిగాడు. వీసా రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అక్కడ కొద్దిరోజులు గడిచాక భర్త చెప్పినవన్నీ అబద్దాలని తెలిసింది. కట్నకానుకల డబ్బు అక్కడే అయిపోయింది. దీంతో అంజ¯ŒSకుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. కానీ వచ్చే జీతం ఏమాత్రం సరిపోయేది కాదు. అన్నీ సర్దుకుపోయిన పుష్ఫలత అక్కడే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో రూ.30వేలు జీతానికి ఉద్యోగంలో చేరింది. కానీ అది ఇష్టం లేని భర్త ఆమెను ఉద్యోగం మాన్పించాడు. సంసారంలో ఒడిదుడుకులు వచ్చాయి. ఈ క్రమంలో పుష్ఫ పుట్టింటికి వచ్చేది పెద్దలు పంచాయతీ చేసి కలిపేవారు. గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో కూడా అంజ¯ŒS తన భార్యను తన వెంట పంపాలని కాళ్లావేళ్లాపడి పుణే తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఆమె పుట్టింటివారు రూ.2లక్షలు ఇచ్చి పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం స్టాఫ్‌వేర్ కంపె నీలో తిరిగి ఉద్యోగంలో జాయి¯ŒS అవుతానని పుష్ఫలత శనివారం తల్లికి ఫో¯ŒSచేసి చెప్పింది. కానీ అదే రోజే అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మానసిక వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ 306 సెక్ష¯ŒS కింద పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పుష్ఫ తల్లి హుటాహుటినా బయల్దేరి ఆదివారం రాత్రి పుణే చేరుకున్నారు. అప్పటికే పోస్టుమార్టం నిర్వహించేశారు. దీంతో మృతదేహాన్ని అంబులె¯Œ్సలో సోమవారం సాయంత్రం సొరకాయలపేటకు తీసుకొచ్చారు. -
తహసీల్దార్ పనితీరుపై గ్రామస్తుల నిరసన
తెలకపల్లి: తహసీల్దార్ పుష్పలత పనితీరుపై గౌరారం గ్రామస్తులు నిరసన వ్యక్తంచేశారు. ప్రతి నెలా 30న నిర్వహించే సమావేశాన్ని శుక్రవారం గౌరారం గ్రామ పంచాయతీ వద్ద సమావేశం నిర్వహిచారు. తహసీల్దార్ గ్రామస్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు సమాచారం చెప్పడంతో చాలావరకు హాజరు కాలేదు. ప్రజాప్రతినిధులకూ సమాచారం తెలపకపోవడంతో వారు రాలేదని, తహసీల్దార్ నిర్లక్ష్యంతో వల్లే ఇలా జరి గిందని, ముందుగానే సరైన సమాచారం ఇచ్చి స మావేశం ఏర్పాటు చేసేలా చూడాలని గ్రామస్తులు సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో శనివారానికి వాయిదా వేశారు. కార్యక్రమంలో ఎస్ఐ కనకయ్య, ఆర్ఐ కేశవ్, వీఆర్వో చంద్రయ్య పాల్గొన్నారు. -
అనుమానంతో భార్య గొంతు కోసి పరారీ
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానాన్ని పెంచుకుని కిరాతకంగా గొంతుకోశాడు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డు శాంతినగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఒడిశా రాష్ట్రానికి చెందిన పుష్పలతను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. శాంతినగర్‌లో కాపురం పెట్టాడు. ఏమైందోగానీ మంగళవారం తెల్లవారుజామున పుష్పలత గొంతుకోసి అతడు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పలతను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న పుష్పలతకు ప్రాణం పోసేందుకు వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ కిరాతకానికి పాల్పడినట్టు స్థానికుల కథనం. -
భార్య ఉండగానే మరో పెళ్లి
కటకటాల్లోకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ చాంద్రాయణగుట్ట: ప్రేమ పేరుతో వల వేసి... ఒకరికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకున్న ఓ సాప్ట్వేర్ ఇంజినీర్‌ను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం...కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్‌కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాఫ్ట్వేర్ ఇంజినీర్. సైదాబాద్‌కు చెందిన పుష్పలత(25)ను ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్‌లోని సాయిబాబా గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు భార్యతో చక్కగా ఉన్న కిరణ్ ఆ తర్వాత బీటెక్‌లో తనతో పాటు చదువుకున్న గౌలిపురాకుచెందిన స్వాతి (24)ని ప్రేమలోకి దించాడు. తనకు పెళ్లైన విషయాన్ని దాచిపెట్టి 2015 జూన్‌లో సీతాఫల్‌మండిలోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యను సైదాబాద్‌లో, రెండో భార్యను గాయత్రీనగర్‌లో ఉంచాడు. ఇదిలా ఉండగా... మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకురావాలని కిరణ్‌కుమార్‌తో పాటు అతని తండ్రి శంకర్ నాయక్, తల్లి, అన్న, తమ్ముడు వేధించసాగారు. ఈ క్రమంలోనే కిరణ్‌కుమార్ రెండో వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య పుష్పలత ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న కిరణ్‌కుమార్ తల్లి, అన్న, తమ్ముడి కోసం గాలింపు చేపట్టారు. -
ప్రేమ పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోసం
ప్రేమ పేరుతో యువతులకు వలవేసి ఒకరి తర్వాత ఒకరిని పెళ్లిచేసుకున్న ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌ను ఛత్రినాక పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్మన్‌ఘాట్ గాయత్రీనగర్‌కు చెందిన శంకర్ నాయక్ కుమారుడు కిరణ్ కుమార్(27) సాప్ట్వేర్ ఇంజనీర్. సైదాబాద్‌కు చెందిన పుష్పలత(25) అనే యువతిని ఐదేళ్ల పాటు ప్రేమించి 2013లో బాలాపూర్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్ల పాటు చక్కగా కాపురం చేసుకున్న ఇతగాడు రంగు మార్చాడు. బీటెక్‌లో తనతో పాటు చదివిన గౌలిపురా శ్రీరాం కాలనీకి చెందిన స్వాతి (24)ని ప్రేమ ముగ్గులోకి దించాడు. అంతకు ముందు జరిగిన వివాహాన్ని దాచిపెట్టి 2015 జూన్ లో సీతాఫల్‌మండిలోని ఆర్యసమాజ్‌లో స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత మొదటి భార్య పుష్పలతను కట్నం తీసుకు రావాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. కిరణ్ తో పాటు.. అతని కుటుంబ సభ్యులు కూడా పుష్పలతను వేధింపులకు గురిచేస్తూ ఉండే వారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెండో వివాహం సంగతి బయట పడింది. దీంతో పుష్పలత ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిరణ్ కుమార్‌తో పాటు అతని తండ్రిని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. కాగా.. కిరణ్ కుమార్ తల్లి, అన్న, తమ్ముడు పరారీలో ఉన్నారు. -
విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు
సారంగాపూర్ :వివాహేతర సంబంధాలు, అనుమానాల కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. దీని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు.. ప్రేమ, వాత్సల్యానికి దూరమవుతూ అనాథలుగా మిగిలిపోతున్నా రు. క్షణికావేశం, మితిమీరిన అహంకారం వారి పిల్లలకు శాపంగా మారుతోందని గ్రహించని స్థి తిలో ఏం చేయడానికైనా తెగిస్తూ తమ జీవితం, పిల్లల భవిష్యత్తును చిదిమేస్తున్నారు. దీనికి నిదర్శనం సారంగాపూర్ మండలంలో ఇదివరకు జ రిగిన ఘాతుకాలే. శుక్రవారం రాత్రి సైతం మం డలంలోని జామ్ గ్రామంలో వివాహేతర సం బంధం వద్దని.. మనకు పిల్లలున్నారని వారించి న పాపానికి ప్రియురాలితో కలిసి కట్టుకున్న భార్యనే కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ ఘాతుకానికి ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఇలా జరిగింది... జామ్ గ్రామానికి చెందిన పబ్బు అల్లమయ్యతో నిర్మల్ పట్టణం బంగల్‌పేట్‌కు చెందిన పుష్పలత(ప్రేమల)కు 25 ఏళ్లక్రితం వివాహం జరి గింది. వారి వైవాహిక బంధానికి ప్రతీకగా వారి కి నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అయితే వివాహానంతరం నుంచే అల్లమయ్య మద్యం తాగుతూ, వివాహేతరర సంబంధాలు కొనసాగిస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇదే సమయంలో అల్లమయ్య తండ్రి అయిన లింగమ య్య బాధ్యత లేని కొడుకుపై నమ్మకం లేక ము గ్గురు పిల్లలకు తన కష్టార్జితంతో వివాహం జరి పించాడు. వివాహాలు చేసిన తన తండ్రి, భార్యలను డబ్బుల కోసం తరచూ వేధించేవాడు అల్లమయ్య. ఈ వేధింపులు తాళలేక భార్య పుష్పల త, తండ్రి లింగమయ్య పలుమార్లు అల్లమయ్య పై పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా తనలో మార్పు రాలేదు. మార్పు రాకపోగా మళ్లీ వివాహేతర సంబంధాలను కొనసాగించాడు. శుక్రవారం రాత్రి నిర్మల్ మండలం మేడిపెల్లి గ్రామానికి చెందిన ఓ మహిళను వెంట తెచ్చుకు ని వచ్చి తన ఇంట్లోనే కార్యకలాపాలు సాగించా డు. అది గమనించిన ఆయన భార్య దానిని అ డ్డుకునేందుకు ప్రయత్నిస్తే చిన్నకూతురు రుచిత ను, భార్యను చితకబాదాడు. అంతటితో ఊరుకోకుండా ముందుగా తన వెంట తెచ్చిన పురుగుల మందును అల్లమయ్య, తన ప్రియురాలు ఇద్దరు కలిసి పుష్పలత నోట్లో బల వంతంగా పోశారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె ను స్థానికులు కాపాడేందుకు గాను 108కు ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చే లోపే పుష్పలత తుది శ్వాస విడిచింది. దీంతో అల్లమయ్య కటకటాల పాలు కాగా.. తల్లి మరణించడంతో తన 12 ఏళ్ల కుమార్తె రుచిత తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలిపోయింది. అల్లమయ్యను గ్రామస్తులు బ ట్టలూడదీసి చితకబాది పోలీసులకు అప్పగించా రు. ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేశారు. అనుమానమే అనాథలను చేసింది మండలంలోని జామ్ గ్రామానికి చెందిన ఆరె గంగాధర్-వజ్రమాల అనే దంపతులను అనుమానం అనే భూతం కాటేసింది. మహారాష్ట్రలోని మలక్ జామ్ గ్రామానికి చెందిన గంగాధర్ జామ్ గ్రామానికి చెందిన వజ్రమాలను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు వినీల, విజయ్ జన్మించారు. అయితే వారికి అప్పట్లో 12 ఏళ్లు వచ్చాక వారి తల్లి అయిన ఆరె వజ్రమాలను 2010 ఏప్రిల్ మూడో తేదీన తండ్రి గంగాధర్ వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. అనంతరం తన ఇద్దరు పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గంగాధర్ సైతం గ్రామ చివరన పంట పొలాల్లో ఉరేసుకుని తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఆ దంపతుల సంతానం వినీల, విజయ్లిద్దరూ అనాథలయ్యారు. అప్పటి నుంచి అమ్మమ్మ కోర్వ లక్ష్మి, తాతయ్య భోజన్నలే వారి ఆలనాపాలనా చూస్తున్నారు. ఇలా అనుమానాలు క్షణికావేశాలతో ఎంతో మంది అనాథలవుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి అనుమానం వస్తే కనీసం ఐదు నిమిషాలైనా ఆలోచించండి. క్షణికావేశం తమ జీవితాన్నే కాక తమపై ఆధారపడే వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని గ్రహించాలి. వచ్చిన ఆవేశాన్ని ఆ ఐదు నిమిషాలు ఆపుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం కనిపిస్తుంది. నిండు జీవితం మీతోనే ఉంటుంది.