ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెపై అనుమానాన్ని పెంచుకుని కిరాతకంగా గొంతుకోశాడు. నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డు శాంతినగర్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఆత్మకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఒడిశా రాష్ట్రానికి చెందిన పుష్పలతను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. శాంతినగర్‌లో కాపురం పెట్టాడు.
ఏమైందోగానీ మంగళవారం తెల్లవారుజామున పుష్పలత గొంతుకోసి అతడు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పలతను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న పుష్పలతకు ప్రాణం పోసేందుకు వైద్యులు శస్త్రచికిత్స ప్రారంభించారు. భార్యపై అనుమానంతోనే వెంకటేశ్వర్లు ఈ కిరాతకానికి పాల్పడినట్టు స్థానికుల కథనం.