మనోవేదనతో మహిళ ఆత్మహత్య | woman suicide | Sakshi
Sakshi News home page

మనోవేదనతో మహిళ ఆత్మహత్య

Published Tue, Jan 24 2017 12:37 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

woman suicide

= విదేశీ ఉద్యోగం పేరుతో మోసపుపెళ్లి... 
= ఎంత సర్దుకున్నా సజావుగా సాగని సంసారం 
= భర్త వేధింపులతో జీవితంపై విరక్తి 
= ఉరేసుకుని భార్య ఆత్మహత్య 
= పుణే పోలీసుల అదుపులో భర్త 
 
సొరకాయలపేట (పామిడి) : ఎంత సర్దుకున్నా సంసారం సజావుగా సాగకపోవడానికి తోడు నువ్వు చస్తేగానీ నాకు మనశ్శాంతి ఉండదంటూ భర్త వేధించడం తాళలేని ఓ మహిళకు జీవితంపై విరక్తి కలిగింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితుల కథనం మేరకు... పామిడి మండలంలోని సొరకాయలపేట గ్రామానికి చెందిన కల్లు పెద్ద లక్ష్మినారాయణ, కల్లు లక్ష్మిదేవి దంపతుల కుమారుడు కల్లు అంజ¯ŒSకుమార్‌యాదవ్‌ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పడంతో గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన వితంతువు ఎస్‌.గురులక్షీ్మదేవి ఎంబీఏ చదివిన తన పెద్ద కుమార్తె ఎస్‌.పుష్ఫలత(25)ను ఇచ్చి పెళ్లి చేసింది.

కట్నకానులక కింద రూ.5లక్షలు, 18 తులాల బంగారం ఇచ్చింది. పెళ్లయిన తర్వాత అంజ¯ŒSకుమార్‌ ఆస్ట్రేలియా తీసుకెళ్తానని చెప్పి భార్యను పుణే తీసుకెళ్లి ఒక అపార్ట్‌మెంట్లో అద్దెకు దిగాడు. వీసా రాలేదంటూ చెప్పుకొచ్చాడు. అక్కడ కొద్దిరోజులు గడిచాక భర్త చెప్పినవన్నీ అబద్దాలని తెలిసింది. కట్నకానుకల డబ్బు అక్కడే అయిపోయింది. దీంతో అంజ¯ŒSకుమార్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. కానీ వచ్చే జీతం ఏమాత్రం సరిపోయేది కాదు.

అన్నీ సర్దుకుపోయిన పుష్ఫలత అక్కడే ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో రూ.30వేలు జీతానికి ఉద్యోగంలో చేరింది. కానీ అది ఇష్టం లేని భర్త ఆమెను ఉద్యోగం మాన్పించాడు. సంసారంలో ఒడిదుడుకులు వచ్చాయి. ఈ క్రమంలో పుష్ఫ పుట్టింటికి వచ్చేది పెద్దలు పంచాయతీ చేసి కలిపేవారు. గత ఏడాది డిసెంబర్‌ చివరి వారంలో కూడా అంజ¯ŒS తన భార్యను తన వెంట పంపాలని కాళ్లావేళ్లాపడి పుణే తీసుకెళ్లాడు. అప్పుడు కూడా ఆమె పుట్టింటివారు రూ.2లక్షలు ఇచ్చి పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం స్టాఫ్‌వేర్‌ కంపె నీలో తిరిగి ఉద్యోగంలో జాయి¯ŒS అవుతానని పుష్ఫలత శనివారం తల్లికి ఫో¯ŒSచేసి చెప్పింది.

కానీ అదే రోజే అపార్ట్‌మెంట్‌లోని బెడ్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త మానసిక వేధింపులు తాళలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందంటూ 306 సెక్ష¯ŒS కింద పుణే పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న పుష్ఫ తల్లి హుటాహుటినా బయల్దేరి ఆదివారం రాత్రి పుణే చేరుకున్నారు. అప్పటికే  పోస్టుమార్టం నిర్వహించేశారు. దీంతో మృతదేహాన్ని అంబులె¯Œ్సలో సోమవారం సాయంత్రం సొరకాయలపేటకు తీసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement