
ఆళ్లగడ్డ: ‘ఎన్నికల సమయంలో వాల్మీకులందరినీ ఎస్టీల జాబితాల్లో చేరుస్తామని చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాం’ అన్నా అని వాల్మీకి రిజర్వేషన్ పోరాటసమితి మహిళా విభాగం నాయకురాలు, ఎంపీటీసీ పుష్పలత వైఎస్‌జగన్‌తో అన్నారు. మంగళవారం బేతంచర్లకు పాదయాత్రగా చేరుకున్న వైఎస్ జగన్‌కు ఆమె వాల్మీకి సంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ‘వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తామని టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు తాము నాలుగేళ్లుగా ఎన్నో పోరాటాలు చేస్తున్నా చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మాకు న్యాయం జరిగేలా చూడండి’ అని ఆమె వైఎస్‌జగన్‌ను కోరారు. అందుకు ఆయన స్పందిస్తూ దీనిపై విచారించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా నాయకులు భువనేశ్వరి, సులోచన, నాగజ్యోతి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment