తహసీల్దార్‌ పనితీరుపై గ్రామస్తుల నిరసన | villagers protest on Tahasildar performance | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌ పనితీరుపై గ్రామస్తుల నిరసన

Published Sun, Jan 1 2017 3:08 AM | Last Updated on Sun, Sep 2 2018 3:46 PM

తహసీల్దార్‌ పనితీరుపై గ్రామస్తుల నిరసన - Sakshi

తహసీల్దార్‌ పనితీరుపై గ్రామస్తుల నిరసన

తెలకపల్లి: తహసీల్దార్‌ పుష్పలత పనితీరుపై గౌరారం గ్రామస్తులు నిరసన వ్యక్తంచేశారు. ప్రతి నెలా 30న నిర్వహించే సమావేశాన్ని శుక్రవారం గౌరారం గ్రామ పంచాయతీ వద్ద సమావేశం నిర్వహిచారు. తహసీల్దార్‌ గ్రామస్తులకు సరైన సమాచారం ఇవ్వకుండా అప్పటికప్పుడు సమాచారం చెప్పడంతో చాలావరకు హాజరు కాలేదు. ప్రజాప్రతినిధులకూ సమాచారం తెలపకపోవడంతో వారు రాలేదని, తహసీల్దార్‌ నిర్లక్ష్యంతో వల్లే ఇలా జరి గిందని, ముందుగానే సరైన సమాచారం ఇచ్చి స మావేశం ఏర్పాటు చేసేలా చూడాలని గ్రామస్తులు సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో శనివారానికి వాయిదా వేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ కనకయ్య, ఆర్‌ఐ కేశవ్, వీఆర్వో చంద్రయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement