భర్త, కుమార్తెతో జీవిత
తిరువొత్తియూరు: భర్త వివాహేతర సంబంధం గురించి ప్రశ్నించిన సమయంలో వరకట్నం కోసం వేధించడంతో సోమవారం సాయంత్రం రైలు నుంచి కిందకి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన దిగ్భ్రాంతిని కలుగచేసింది. చెన్నై జార్జ్‌టౌన్ ప్రాంతానికి చెందిన జీవిత వానగరం అపోలో ఆసుపత్రిలో వైద్య సహాయకురాలిగా పని చేస్తున్నారు. ఈమెకు చెన్నై ఆవడికి చెందిన మురళి కుమారుడు రోస్‌తో 2016 సంవత్సరంలో వివాహమైంది. ఈ దంపతులకు ఒక ఆడ బిడ్డ ఉంది. ఈ క్రమంలో భర్తకు మరో యువతితో వివాహేతర సంబంధం ఏర్పడిన సంగతి తెలుసుకున్న జీవిత దిగ్భ్రాంతి చెందింది.
దీని గురించి తన భర్తను ప్రశ్నించింది. అయితే రోస్ తండ్రి, తల్లి వరకట్నం తీసుకురమ్మని జీవితను వేధించేవారని తెలిసింది. దీని గురించి జీవిత తన బంధువులకు తెలపగా వారు ఆమె సర్దిజెప్పి పంపినట్టు తెలిసింది. దీనిపై భార్య, భర్తకు సోమవారం గొడవ ఏర్పడింది. దీంతో విరక్తి చెందిన జీవిత తల్లిదండ్రుల ఇంటికి రావడానికి తాంబరం నుంచి బీచ్ రైల్వేస్టేషన్‌కు రైలు ఎక్కింది. రైలులో వెళుతున్న సమయంలో అడయారు వంతెనపై కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment