
అద్దంకి రూరల్: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన అద్దంకి పట్టణంలోని కొత్త దామావారిపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు పట్టణంలోని కొత్తదామావారిపాలెంలో నివాసం ఉంటున్న కటికల సుజాత (25) స్థానిక పెట్రోలు బంకులో పనిచేస్తున్న వీరాంజనేయులుని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవల భర్తపై అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించగా, మార్గమధ్యంలోనే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.