వెంకటేశ్వర్లు, సుభాషిణి పెళ్లి నాటి ఫొటో
నెల్లూరు , విడవలూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని ఊటుకూరులో శుక్రవారం జరిగింది. వివాహిత బంధువులు, పోలీసుల కథనం మేరకు.. ఊటుకూరుకు చెందిన డి వెంకటేశ్వర్లు బేల్దారీగా పనులు చేసుకుంటున్నాడు. అతనికి ప్రకాశం జిల్లా తెట్టు గ్రామానికి చెందిన సుభాషిణి (25)తో నాలుగేళ్ల కిత్రం రెండో వివాహాన్ని జరిపించారు. ఆ సమయంలో అన్ని లాంచనాలు అందజేశారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. కొంత కాలం అన్యోన్యంగా సాగిన వీరి కాపురంలో ఇటీవల కలతలు మొదలయ్యా యి.
దీంతో మనస్థాపానికి గురైన సుభాషిణి తన ఇంట్లో మరో గదికిలో ఉదయం 5 గంటలకు వెళ్లి తలుపు వేసుకుంది. అయితే ఎంత సేపటికి భార్య బయటకు రాకపోవడంతో వెంకటేశ్వర్లు ఆ గదిలోకి వెళ్లి చూడగా సుభాషిణి తన చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించాడు. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులతో పాటు సుభాషిణి తల్లిదండ్రులకు తెలియజేశాడు. సుభాషిణి తల్లిదండ్రులు ఊటుకూరు గ్రామానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై వెంకట్రావు, తహసీల్దార్ బాలమురళీకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే సుభాషిణి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment