జిల్లాలోని రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.
రామభద్రపురంలో బోల్తా పడిన ఆటో..
మ్మలక్ష్మీపురంలో ఢీకొన్న
ద్విచక్ర వాహనాలు
రామభద్రపురం/గుమ్మలక్ష్మీపురం : జిల్లాలోని రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రాపురం మండలం ఆరికతోట పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో నలుగురు గాయపడ్డారు. గజపతినగరంనకు చెందిన వరద సరోజిని, వరద కోటి (డ్రైవర్) , పిన్నింటి అన్నపూర్ణ, వేట్ల అజయ్‌కుమార్ శంబర అమ్మవారి దర్శనం చేసుకుని ఆటోలో తిరిగి వస్తున్నారు. సరిగ్గా ఆరికతోట పెట్రోల్‌బంక్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమదంలో సరోజిని, కోటికి తీవ్రగాయాలు కాగా, అన్నపూర్ణ, అజయ్‌కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి.ఈ నలుగురినీ ప్రథమ చికిత్స కోసం బాడంగి సీహెచ్‌సీకి తలించగా, అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హెచ్‌సీ రమణ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వైపు వెళ్లే ప్రధాన రహదారిలోని మ«ధర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. లక్కగూడ గ్రామానికి చెందిన మధుబాబు పార్వతీపురం వైపు వెళ్తుంగా, నేరేడుమానుగూడకు వెళ్లేందుకు ఎదురుగా వస్తున్న రాజేష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడడంతో స్థానికులు భద్రగిరి ఆస్పత్రికి తరలించారు.