Six injuries
-
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
నల్లగుంట్ల (కొమరోలు) : వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన పాటకచేరి బృందం.. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో పాటకచేరి ముగించుకొని టాటా మ్యాజిక్‌లో స్వగ్రామం బయల్దేరింది. ఆదే మార్గంలో తిరుపతి నుంచి తర్లుపాడు మండలం నాగులారానికి ప్రయాణికులతో తుఫాన్ వాహనం వెళ్తోంది. ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని వెనుక వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పైడిపల్లి ప్రకాశం, శ్రీను, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, చంద్రిక, సునీతలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. టాటా మ్యాజిక్‌లో ఉన్న పైడిపల్లి ప్రశాశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. నల్లగుంట్ల (కొమరోలు) : వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన పాటకచేరి బృందం.. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో పాటకచేరి ముగించుకొని టాటా మ్యాజిక్‌లో స్వగ్రామం బయల్దేరింది. ఆదే మార్గంలో తిరుపతి నుంచి తర్లుపాడు మండలం నాగులారానికి ప్రయాణికులతో తుఫాన్ వాహనం వెళ్తోంది. ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని వెనుక వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పైడిపల్లి ప్రకాశం, శ్రీను, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, చంద్రిక, సునీతలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. టాటా మ్యాజిక్‌లో ఉన్న పైడిపల్లి ప్రశాశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
రామభద్రపురంలో బోల్తా పడిన ఆటో.. మ్మలక్ష్మీపురంలో ఢీకొన్న ద్విచక్ర వాహనాలు రామభద్రపురం/గుమ్మలక్ష్మీపురం : జిల్లాలోని రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. రామభద్రాపురం మండలం ఆరికతోట పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో నలుగురు గాయపడ్డారు. గజపతినగరంనకు చెందిన వరద సరోజిని, వరద కోటి (డ్రైవర్) , పిన్నింటి అన్నపూర్ణ, వేట్ల అజయ్‌కుమార్ శంబర అమ్మవారి దర్శనం చేసుకుని ఆటోలో తిరిగి వస్తున్నారు. సరిగ్గా ఆరికతోట పెట్రోల్‌బంక్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమదంలో సరోజిని, కోటికి తీవ్రగాయాలు కాగా, అన్నపూర్ణ, అజయ్‌కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయి.ఈ నలుగురినీ ప్రథమ చికిత్స కోసం బాడంగి సీహెచ్‌సీకి తలించగా, అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హెచ్‌సీ రమణ కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. అలాగే గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వైపు వెళ్లే ప్రధాన రహదారిలోని మ«ధర్ పబ్లిక్ స్కూల్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. లక్కగూడ గ్రామానికి చెందిన మధుబాబు పార్వతీపురం వైపు వెళ్తుంగా, నేరేడుమానుగూడకు వెళ్లేందుకు ఎదురుగా వస్తున్న రాజేష్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడడంతో స్థానికులు భద్రగిరి ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
రాజాంరూరల్, న్యూస్‌లైన్: శ్రీకాకుళం నుంచి రాజాం వెళ్లే రోడ్డులో వాసవి పైపుల కర్మాగార సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తలతో పాటు ముగ్గురు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. పొనుగుటి వలసకు చెందిన శాసపు రమణమ్మ, చిన్నారులు అక్షయ,రోహిత్‌కుమార్, మానసలు కార్తీక పౌర్ణమికోసం గేదెలపేటలోని బంధువులు ఇంటికి వెళ్లారు. రమణమ్మకు మేనల్లుడైన గేదెల కోటేశ్వరరావు... రమణమ్మతో పాటు చిన్నారులను రాత్రి 9 గంటల సమయంలో పొనుగుటివలసకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా ముందు వెళ్తున్న వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన టి.రాము అనే సైకిలిస్టును చీకట్లో ఢీకొన్నాడు. ఈ సంఘటనలో సైకిలిస్టుతో పాటు కోటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకోగా అక్షయ అనే చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యింది. మిగిలిన వారికి స్వల్పగాయా లయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు కలిశెట్టి సురేష్‌బాబు చికిత్స అందించారు. వీరిలో కోటేశ్వరరావు, అక్షయల పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.