నల్లగుంట్ల (కొమరోలు) : వేగంగా వస్తున్న తుఫాన్ వాహనం ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో శనివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నరసరావుపేటకు చెందిన పాటకచేరి బృందం.. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్లలో పాటకచేరి ముగించుకొని టాటా మ్యాజిక్‌లో స్వగ్రామం బయల్దేరింది. ఆదే మార్గంలో తిరుపతి నుంచి తర్లుపాడు మండలం నాగులారానికి ప్రయాణికులతో తుఫాన్ వాహనం వెళ్తోంది.
ముందు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని వెనుక వస్తున్న తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో పైడిపల్లి ప్రకాశం, శ్రీను, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, చంద్రిక, సునీతలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో గిద్దలూరు వైద్యశాలకు తరలించారు. టాటా మ్యాజిక్‌లో ఉన్న పైడిపల్లి ప్రశాశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
Published Sun, Jun 4 2017 2:14 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement