రాజాంరూరల్, న్యూస్‌లైన్: శ్రీకాకుళం నుంచి రాజాం వెళ్లే రోడ్డులో వాసవి పైపుల కర్మాగార సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తలతో పాటు ముగ్గురు చిన్నారులు తీవ్ర గాయాలపాలయ్యారు. పొనుగుటి వలసకు చెందిన శాసపు రమణమ్మ, చిన్నారులు అక్షయ,రోహిత్‌కుమార్, మానసలు కార్తీక పౌర్ణమికోసం గేదెలపేటలోని బంధువులు ఇంటికి వెళ్లారు. రమణమ్మకు మేనల్లుడైన గేదెల కోటేశ్వరరావు... రమణమ్మతో పాటు చిన్నారులను రాత్రి 9 గంటల సమయంలో పొనుగుటివలసకు ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా ముందు వెళ్తున్న వీఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన టి.రాము అనే సైకిలిస్టును చీకట్లో ఢీకొన్నాడు. ఈ సంఘటనలో సైకిలిస్టుతో పాటు కోటేశ్వరరావు తలకు తీవ్ర గాయాలవ్వడంతో అపస్మారక స్థితికి చేరుకోగా అక్షయ అనే చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యింది. మిగిలిన వారికి స్వల్పగాయా లయ్యాయి. క్షతగాత్రులను 108 సహాయంతో రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు కలిశెట్టి సురేష్‌బాబు చికిత్స అందించారు. వీరిలో కోటేశ్వరరావు, అక్షయల పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
Published Mon, Nov 18 2013 3:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement