టీడీపీ తీరు దారుణం
బొబ్బిలి:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం మీద గెలిచిన వారిని రకరకాల ప్రలోభాలకు గురి చేసి, వారిని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు దురదృష్టకరమని ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. బుధవారం ఆయన బొబ్బిలి కోటలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సెంట్రల్ కార్యాల యం నుంచి అధికార ప్రతినిధులే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. వైఎస్సార్ సీపీకి విప్ జారీ చేసే అర్హత లేదని, ఎవరైనా పార్టీలోకి వచ్చేయవచ్చని బహిరంగంగా ప్రకటనలు ఇస్తున్నారన్నారు. తమ పార్టీలో ఉన్నవారంతా క్రమశిక్షణతో ఉండేవారని, ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. పార్టీని వదిలి వెళ్లరన్న నమ్మకం ఉందన్నారు.
వైఎస్సార్ సీపీకి బలం ఉండ డం వల్లే మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్షు ల పదవులు దక్కించుకోవడానికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో విప్ జారీ చేస్తున్నామని తెలి పారు. సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడుతూ పార్టీ బలంగా లేకపోయినా టీడీపీ తామే అధికారంలో కి వచ్చేస్తామని చెప్పి, ప్రలోభాలకు గురి చేయడం ప్ర జాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. స్వ తంత్ర అభ్యర్థులు మద్దతు పలికితే వారిపై కోర్టుకు వెళ్తతామని చెప్పారు. పాచిపెంట, మక్కువ మండలాల్లో టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరో పించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వారు చేస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు.
సాలూరు మున్సిపాలిటీలో తాము అధికారంలో కి వచ్చేంత బలం లేకపోవడంతో స్తబ్ధతగా ఉన్నామని చెప్పారు. గురువారం జరిగే ఎన్నికల్లో తమ కౌన్సిలర్లు తట స్టతంగా ఉండేందుకు విప్ జారీ చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడు తూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో విప్ జారీ చేస్తున్నామన్నా రు. మండలాలకు సంబంధించి ఒక ఎంపీటీసీకి, జెడ్పీ కి సంబంధించి ఒక జెడ్పీటీసీకి విప్ జారీ చేసే అధికారాన్ని ఇస్తున్నామని తెలిపారు. తక్కువ మంది సభ్యులున్న దగ్గర క్రమశిక్షణ అమలయ్యేలా చూస్తామన్నా రు.
జెడ్పీ మాజీ చైర్మన్ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ వైఎస్సార్ సీపీకి విప్ జారీ చేసే అవకాశం ఉందని ప్రకటిస్తుంటే టీడీపీ మాత్రం విప్ లేదంటూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. విప్ ను ధిక్కరిస్తే అనర్హత వేటు పడుతుందన్న విషయాన్ని పార్టీ గుర్తుపై ఎన్నికైన వారు గుర్తించాలని సూచిం చా రు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్, విజ యనగరం మాజీ కౌన్సిలర్ ఆశపు వేణు ఉన్నారు.