విజయనగరం: చెన్నై భవన ప్రమాద భాదితులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ రాజకీయం చేయడం శోచనీయమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణరంగారావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి అన్నారు. క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
సుశీల అనే బాధితురాలికి కేజీహెచ్‌లో వైద్యం నిరాకరించారని తెలిపారు. పార్టీ తరపును బాధితురాలికి వైద్యసాయం అందిస్తామని చెప్పారు. చెన్నై భవన ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.
పరామర్శను రాజకీయం చేస్తారా?
Published Wed, Jul 23 2014 12:44 PM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement