Rajannadora
-
వైఎస్సార్సీపీ సామాజిక సాధికర బస్సు యాత్ర: బడుగుల రాజ్యమిది
సాక్షి, అనకాపల్లి: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బడుగుల రాజ్యాన్ని స్థాపించారని డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. బడుగు, బలహీనవర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పెద్దపీట వేసిన తొలి సీఏం వైఎస్ జగన్ అని చెప్పారు. గురువారం అనకాపల్లిలో జరిగిన సామాజిక సాధికార సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర కేబినెట్లో 25 మంది మంత్రులకుగాను 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని, ఇతర అన్ని పదవుల్లోనూ ఈ వర్గాలకే సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనన్ని పదవులు, పథకాలు అందించి సామాజిక సాధికారత తీసుకొచ్చారన్నారు. బీసీలకు రూ.1.62 లక్షల కోట్లు, దళితులకు రూ.61 వేల కోట్లు, గిరిజనులకు రూ.20 వేల కోట్లను వెచ్చించారని తెలిపారు. అడవి బిడ్డ అయిన తనను ఉపముఖ్యమంత్రిని చేసి పక్కనే కూర్చోబెట్టుకున్న నాయకుడు జగనన్న అని కొనియాడారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు ఎల్లవేళలా మంచిగా ఉండాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని చెప్పారు. గిరిజనులు సాధారణంగా సౌమ్యంగా ఉంటారని, ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తే వారిపై ఒక్కొకరు ఒక్కో అల్లూరి సీతారామరాజులా పోరాడతారని హెచ్చరించారు. జగన్ చెప్పారంటే చేస్తారు: బూడి చెప్పిన మాట తూచా తప్పకుండా చేసే సీఎం వైఎస్ జగన్ అని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99.5% అమలు చేయడమే కాకుండా, చెప్పని అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అవ్వా తాతలకు వచ్చే నెల నుంచి రూ.3 వేల పింఛను అందించనున్నారన్నారు. బడుగు బలహీనవర్గాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆకాంక్షతో వారికి యూనిఫాం, నాణ్యమైన భోజనం, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన వంటి పథకాలే కాకుండా అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నారని తెలిపారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు మూడు విడతల చేయూత అందించారని, నాలుగో విడత సంక్రాంతి పండుగ తర్వాత అందించనున్నారని చెప్పారు. గర్వంగా మీ వద్దకు వచ్చాం: మంత్రి ధర్మాన నాలుగున్నరేళ్ల పాలనలో మేనిఫెస్టోలో హామీలన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడంతో.. బడుగు వర్గాలకు అందించిన సాధికారతను కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకునేందుకు మీ ముందుకు వచ్చామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు మహిళా సాధికారత కూడా నెరవేరిందన్నారు. ఈ ప్రభుత్వంలో స్త్రీని అత్యంత శక్తివంతురాలుగా చేసి, వారి ఖాతాల్లోకే సంక్షేమ పథకాల నగదు జమయ్యేలా చేశారన్నారు. తాను పస్తు ఉండి ఇంటిల్లిపాదికీ అన్నం పెట్టేదే స్త్రీ మూర్తి అని, ఇంటిలో ఇల్లాలి చేతిలో డబ్బులుంటే ఆ ఇంట్లో వెలుగులుంటాయని నమ్మిన సీఎం జగన్ అని చెప్పారు. అనేక కులాలకు గుర్తింపు: మంత్రి గుడివాడ ఇప్పటివరకు గుర్తింపు లేని అనేక కులాలకు గుర్తింపు తెచ్చిన సీఎం జగన్ మాత్రమేనని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. నాలుగున్నరేళ్లలో అనకాపల్లి నియోజకవర్గంలో రూ.880 కోట్లతో సంక్షేమ పథకాలను అందించామంటే ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 20 వేల మంది పేదలకు సొంతింటి కల నెరవేరిందన్నారు. జగనన్న పాలనలో ప్రతి పేదోడు తలెత్తుకు జీవిస్తున్నాడని, జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు బావుంటుందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చెప్పారు. మాయలోడు చంద్రబాబు వలలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, అల్లూరి సీతారామరాజు ఆశయాలను నెరవేరుస్తూ సామాజిక న్యాయం సాధించిన ఘనత సీఎం జగన్‌దే అని ఎంపీ డాక్టర్ బి.వి. సత్యవతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు, ఏపీఐడబ్యూఏ చైర్మన్ దంతులూరి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘డౌనూరు’లో కాఫీ క్యూరింగ్ కేంద్రం
కొయ్యూరు: దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డౌనూరులో కాఫీ క్యూరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. కొయ్యూరు మండలంలోని డౌనూరులో రూ.4 కోట్లతో ఏర్పాటు చేస్తోన్న కాఫీ క్యూరింగ్, రోస్టింగ్, ప్యాకింగ్ యూనిట్‌కు శుక్రవారం వైఎఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి రాజన్నదొర శంకుస్థాపనచేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..నాణ్యమైన సేంద్రియ ఎరువులతో కాఫీని పండించడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుందన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ 20 సదస్సులో అతిథులకు ప్రధాని మోదీ అరకు కాఫీని బహూకరించారని గుర్తు చేశారు. అల్లూరి జిల్లా పాడేరు డివిజన్లో ప్రస్తుతమున్న 2.5 లక్షల ఎకరాలకు అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు గిరిజన సంక్షేమానికి ఖర్చు చేసిందన్నారు. గిరిజనుల నుంచి పసుపును కూడా కొనుగోలు చేయాలని జీసీసీ ఎండీ సురేష్‌కుమార్‌ను ఆదేశించారు. గిట్టుబాటు ధర విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. కాఫీ రైతులకు రుణాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీ మాధవి, ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ఐటీడీఏ పీవో అభిషేక్ పాల్గొన్నారు. -
భావి తరాలకు పదిలంగా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను రాబోయే తరానికి అందించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గిరిజన తెగల సంస్కృతి, భాషల అధ్యయనం విస్తృతంగా సాగుతోంది. గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను వీడియో డాక్యుమెంటేషన్ చేసి విస్తృత ప్రచారం కల్పించేందుకు గట్టి ప్రయత్నం జరుగుతోంది. గిరిజనుల వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని రాబోయే తరాలకు తెలియజేయడం కోసం గిరిజన వస్తు ప్రదర్శనశాలలు(మ్యూజియం)ను ఏర్పాటు చేసింది. అరకులోయ, శ్రీశైలం, సీతంపేట(శ్రీకాకుళం జిల్లా)లో గిరిజన వస్తు ప్రదర్శనశాలలను గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన సాహిత్యం, వాజ్ఞయాలతో కూడిన 15 వేలకు పైగా పుస్తకాలను రూపొందించడంతోపాటు, వాటిలోని చాలా వరకు డిజిటలైజేషన్ చేసింది. గ్లోబలైజేషన్ యుగంలో వివిధ గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలుపై హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇటీవల నిర్వహించిన చర్చాగోష్టిలో సమర్పించిన పత్రాలను నాలుగు సంపుటాలుగా వెలువరించింది. గిరిజన బడుల్లో 1 నుంచి 3వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషలోనే విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకుంది. కోయ, ఆదివాసి, సుగాలి, కొండ, సవరా, భారతి, కువి, భాషల్లో 54 వాచకాలు రూపొందించి గిరిజన విద్యార్థులకు అందించింది. బడగ, గదబ, కొండకాపు, గౌడు, కొఠియా, రోనా, భిల్లు, పరంగి పోర్జా, పోర్జా, మాలి, ధూలియా, కట్టునాయకన్, యానాది వంటి గిరిజన తెగలకు చెందిన వారి సంస్కృతి భాష, ఇతర సంప్రదాయాలపై సమగ్ర అధ్యయనాలను చేపట్టింది. కొండరెడ్డి, కోండ్, గదబ, చెంచు, కొరజ, సవర, జాతాపు, నక్కల, కోయ, వాల్మీకి తెగల ఆచార వ్యవహారాలను సంస్కృతిని సంప్రదాయక పరిజ్ఞానాన్ని పరిరక్షించడం కోసం వారి జీవన శైలిని వీడియో రూపంలో డాక్యుమెంటేషన్ చేయడం విశేషం. ఏటా గిరిజనోత్సవాలు గిరిజన సంస్కృతిని వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన స్వాతంత్య్ర పోరాటాలను స్మరించుకోవడానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఏటా గిరిజనోత్సవాలను నిర్వహిస్తోంది. అలాగే ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ జాతర, జూలై 4న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, ఆగస్ట్ 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవం నిర్వహిస్తోంది. గిరిజన కళలను ప్రోత్సహించేందుకు అనేక పోటీలు, ఔత్సాహిక కార్యక్రమాలను చేపడుతోంది. గిరిజన నాట్య బృందాలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే గిరిజన ఉత్సవాల్లో పోటీలకు పంపిస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయపూర్‌లో 2019లో జరిగిన జాతీయ గిరిజన నృత్యోత్సవంలో రాష్ట్రానికి చెందిన ‘కొండరెడ్ల కొమ్ము’ నాట్యానికి 3వ బహుమతి వచ్చింది. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం.. సీఎం జగన్ ఆదేశాలతో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అనేక చర్యలు చేపట్టాం. గిరిజన తెగలకు సంబంధించిన విస్తృత సమాచారాన్ని ప్రపంచానికి అందించేందుకు కృషి చేస్తున్నాం. గిరిజనుల జీవనశైలి, వారి సంస్కృతి, వేషభాషలు, సంగీత, నాట్య పరికరాలు, వ్యవసాయ పరికరాలు, కళలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సేకరించి మ్యూజియంలతోపాటు, వీడియోలు, ఫొటోలు, డిజిటలైజేషన్ తదితర రూపాల్లో అందుబాటులోకి తెస్తున్నాం. మరింత పరిజ్ఞానం తెలుసుకునేలా అధ్యయనం చేపట్టడంతోపాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి -
రాజ్యాంగం ఉపయోగం మోసగాళ్లకేనా?
ఒకే వ్యక్తికి నాలుగు కుల ధ్రువీకరణ పత్రాలా? సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర విజయనగరం మున్సిపాలిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం మోసగాళ్లకు, దోపిడీ దొంగలకు ఉపయోగపడుతో ందని సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పీడిక.రాజన్నదొర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విజయనగరం వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సాలూరు మాజీ ఎమ్మెల్యే ఆర్పి.భంజదేవ్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై జాయింట్ కలెక్టర్ బుధవారం విచారణచేపట్టగా వాయిదా కావాలని భంజ్‌దేవ్ కోరినట్లు తెలిపారు. 2006వ సంవత్సరంలో ఆర్పి.భంజ్‌దేవ్ కుల ధ్రువీకరణపై హైకోర్టు ఆయన గిరిజనుడు కాదని తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అయితే అత్యున్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును బేఖాతరు చేస్తూ గతంలో ఐటీడీఏ పీఓగా విధులు నిర్వహించిన సబ్‌కలెక్టర్ శ్వేతామహంతి గిరిజనుడంటూ ఎలా కులధ్రువీకరణ పత్రం జారీ చేశారన్నారు. న్యాయస్థానం తీర్పును తలకిందులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా జరగలేదన్నారు. ప్రస్థుతం సదరు అధికారి వేరొక రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్నా విడిచిపెట్టేది లేదన్నారు. ఈ విషయంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విజయనగరం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు, పదవులు అనుభవిస్తున్న వారు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కులధ్రువీకరణ కేసులు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై యంత్రాంగం దృష్టి సారించి పరిశీలిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని కోరారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని ముఖ్యమంత్రికి తెలిసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో అంగన్వాడీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీ ప్రక్రియతో పాటు స్వచ్ఛభారత్ ట్రాక్టర్ కొనుగోలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. గిరిజన న్యాయవాది రేగు మహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు చెందిన నాయకులు శోభా.హైమావతి, శత్రుచర్ల, విజయరామరాజు, జనార్దన్ థాట్రాజ్‌లు ఎస్టీలు కాదని సెక్షన్ 11 ప్రకారం ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేశామని, అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై వేసిన కేసు విచారణలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో గుంప ప్రకాశరావు పాల్గొన్నారు. -
రాజన్నదొర మీడియా సమావేశం
-
పరామర్శను రాజకీయం చేస్తారా?
విజయనగరం: చెన్నై భవన ప్రమాద భాదితులను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ రాజకీయం చేయడం శోచనీయమని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు సుజయకృష్ణరంగారావు, రాజన్నదొర, పుష్పశ్రీవాణి అన్నారు. క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సుశీల అనే బాధితురాలికి కేజీహెచ్‌లో వైద్యం నిరాకరించారని తెలిపారు. పార్టీ తరపును బాధితురాలికి వైద్యసాయం అందిస్తామని చెప్పారు. చెన్నై భవన ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు కుటుంబాలకు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ఆర్థికసాయం అందించారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు.