సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీదే విజయం | ysrcp victory in the general election sipide | Sakshi
Sakshi News home page

సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీదే విజయం

Published Mon, Mar 31 2014 1:18 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీదే విజయం - Sakshi

సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీదే విజయం

పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్
 
బొబ్బిలి,  రానున్న సాధారణ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ సీపీ ఘన విజయం సాధిస్తుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని, అందుకు అనుగుణంగా మున్సిపల్ ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు అన్నారు.

ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బొబ్బిలి 26వ వార్డులోని తాండ్ర పాపారాయ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలులో  ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో అధిక శాతం స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. విజయనగరం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను చేజిక్కించుకుంటామన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement