విజయనగరం: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. సీమాంధ్ర ప్రాంతాల్లో నిరసనలు, ధర్మాలు, ర్యాలీలతో సమైక్య పోరు రోజురోజుకీ తీవ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణ విభజనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కారణమంటూ సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దురదృషకరమని వైఎస్ఆర్‌సీపీ నేత సుజయకృష్ణ రంగారావు చెప్పారు.
ప్రజాందోళనకు భయపడి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందించారని ఆయన దుయ్యపట్టారు. మన మధ్యలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని సుజయకృష్ణ రంగారావు చెప్పారు. ఈ విభజనకు ప్రధాన ప్రతిపక్ష నేతే కారణమన్నారు. చిత్తశుద్ది ఉంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రాజీనామాలు స్పీకర్‌కు సమర్పించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీని ప్రజల నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే వైఎస్‌పై ఆరోపణలని చెప్పారు. ఆంటోని కమిటీ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికి ఏర్పాటు చేసిన కంటి తుడుపు చర్య మాత్రమేనని సుజయకృష్ణ రంగారావు పేర్కొన్నారు.
సీఎం కిరణ్ వ్యాఖ్యలు దురదృష్టకరం: సుజయకృష్ణ రంగారావు
Published Fri, Aug 9 2013 11:04 PM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement
Advertisement