మాపై సుజయకృష్ణా రంగారావు విమర్శలా?
విజయనగరం: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జిల్లాలో తోటపల్లి, పెద్దగెడ్డ సహా ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యాయని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ బొబ్బిలిలో మూతపడ్డ పరిశ్రమలనే సుజయకృష్ణ రంగారావు తెరిపించలేకపోయారన్నారు. పైగా వైఎస్‌ఆర్ సీపీపై విమర్శలు చేస్తున్నారని కోలగట్ల ధ్వజమెత్తారు. అంతేకాకుండా విజయనగరంలో జూనియర్ కాలేజీని తీసుకు వచ్చింది కూడా తామేనని అన్నారు.
ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన భూములను కాపాడుకునేందుకే సుజయకృష్ణా రంగారావు పార్టీ మారారని విమర్శించారు. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు బకాయిలు ఇవ్వలేక కోట నుంచి పారిపోయిన చరిత్ర ఆయనదని ఎద్దేవా చేశారు. తమపై విమర్శలు చేసే అర్హత సుజయకృష్ణా రంగారావుకు లేదని అన్నారు.