ప్రజలంటే భయమా? లేదంటే ద్వేషమా?
ఇంటి సమీపంలో సభ పెడితే తనకు రక్షణ ఉండదా?
బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీనాయన ముందస్తుగా బెంగ
సీఎం జగన్ బొబ్బిలి రోడ్డుషోపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: మిట్ట మధ్యాహ్నం... బొబ్బిలి మెయిన్‌రోడ్డు... వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత ప్రచార సభ... వేలాది జనం పోటెత్తారు. బుధవారం ఈ ప్రభంజనాన్ని చూసినవారంతా ఆశ్చర్యపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఉలిక్కిపడ్డారు. ఆయనే బొబ్బిలి టీడీపీ అభ్యర్థి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు ఉరఫ్ బేబీనాయన! తమ పూర్వీకుల వీరప్రతాపం గురించి కోటకు వచ్చినవారందరికీ పూసగుచ్చినట్లు చెప్పే ఆయన... ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి సభ అంటే హడలిపోవడం విచిత్రంగా ఉందని బొబ్బిలి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతకుముందు జరిగిన వైఎస్సార్‌సీపీ సభలకు పోటెత్తిన జనాన్ని చూసి ముందురోజు నుంచే ‘రక్షణ’ పేరుతో చెడగొట్టే కార్యక్రమానికి తెరలేపారు.
బొబ్బిలి కోట సమీపంలో సభ పెడితే తమ కుటుంబానికి భద్రత ఉండదని, తమకు రక్షణ కల్పించాలంటూ తన న్యాయవాది ద్వారా ఎన్నికల కమిషన్‌కు, అధికారులకు ఫిర్యాదులు పంపించడం గమనార్హం. కానీ రోడ్డుషోకు హాజరైన ప్రజలు కానీ, వైఎస్సార్‌సీపీ శ్రేణులు కానీ ఆ కోట గేటు వైపు కూడా కన్నెత్తిచూడలేదు. ఇక తన ప్రసంగంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా బేబీనాయన గురించి కానీ, మంత్రి పదవి కోసం సంతలో పశువులా అమ్ముడుపోయి వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆయన సోదరుడు ఆర్‌వీఎస్‌కే రంగారావు (సుజయ్) గురించి కానీ ప్రస్తావన తీసుకురాలేదు. ఒకవైపు కూటమి నాయకులు తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నా జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం తన ప్రత్యర్థి పారీ్టకి చెందిన బొబ్బిలి రాజుల పట్ల హుందాగా వ్యవహరించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని...
బొబ్బిలి పట్టణంలో దశాబ్దాల సమస్యగా ఉన్న మెయిన్ రోడ్డు విస్తరణనూ చేపట్టలేక బేబీనాయన మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు, ఆయన సోదరుడు సుజయ్ టీడీపీలోకి వెళ్లి మంత్రిగా అధికారం వెలగబెట్టినప్పుడు చేతులెత్తేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.10 కోట్ల వ్యయంతో మెయిన్‌రోడ్డును విస్తరించారు. ఆ సోదరులు బొబ్బిలికి చేసిన మేలేమిటో ఒక్కటీ చెప్పలేరు.
ఆ మెయిన్ రోడ్డుపైనే సభలన్నీ...
‘సైకిల్ పోవాలి’ అంటూ చంద్రబాబు నినాదం ఇచ్చిన ‘ఇదేమి ఖర్మ’ కార్యక్రమం కూడా బొబ్బిలి మెయిన్‌రోడ్డుపైనే 2022 డిసెంబర్ 23న బేబీనాయన సమక్షంలోనే జరిగింది. పట్టుమని రెండు వేల మంది కూడా ఆ కార్యక్రమానికి రాలేదు. ఆ తర్వాత అదే రోడ్డుపై గత ఏడాది నవంబరు 23న జరిగిన వైఎస్సార్‌సీపీ ‘ప్రజా సంకల్పయాత్ర’కు జనం పోటెత్తారు. కళాభారతి నుంచి బొబ్బిలి కోట వరకూ జనసంద్రమైంది. జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమాలకు అంతకుమించి జనం వస్తారనే అంచనాతో బేబీనాయనకు బెంగపట్టుకుంది. సభాస్థలి కోటకు సమీపంలో పెట్టడం ఇష్టం లేక తన కోట ‘భద్రత’ పేరుతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏమిటీ నాయనా మీ గొప్ప...
అధికారం దక్కేవరకే బేబీనాయనకు ప్రజలతో పని. ఒకసారి పీఠం దక్కిందా ఆ తర్వాత అదే ప్రజలను కోట గుమ్మం కూడా ఎక్కనివ్వని చరిత్ర ఆయన సొంతం. చివరకు అధికారులైనా దర్బార్‌మహల్‌లో రోజంతా పడిగాపులు బొబ్బిలి ప్రజలకు అనుభవమే. తొలుత 2009లో బొబ్బిలి 29వ వార్డు కౌన్సిలర్‌గా బేబీ నాయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అదీ కోటను ఆనుకొని ఉన్న వార్డు, ఆరొందలకు మించని ఓటర్లు అయినా సరే గెలుపుపై భయం పట్టుకుంది. అప్పట్లో పోటీ పడిన టీడీపీ అభ్యరి్థని నయానాభయానో ఒప్పించి తన ఏకగ్రీవ ఎన్నిక కోసం బరి నుంచి తప్పించారు.
అలా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకున్న ఆయన పదవీకాలం 2009–14లో ముచ్చటగా మూడుసార్లు మాత్రమే ఆ కురీ్చలో కూర్చున్నారు. కారణమేమిటో తెలుసా? మున్సిపల్ సాధారణ సమావేశాల్లో కౌన్సిలర్లు కొన్ని సమస్యలపై నిలదీస్తుండటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసేవారు. పదవీ అలంకారం కాదు ప్రజాసేవ కోసమనే విషయం తెలియని ఆయన ఇక ఆ తర్వాత ఎప్పుడూ కౌన్సిల్ హాలులోకి అడుగుపెట్టలేదు. వైస్ చైర్మన్ గునాన విజయలక్షి్మకి బాధ్యతలు అప్పగించేసి ప్రజలకు ముఖం చాటేశారు. అంతేకాదు మున్సిపల్ చైర్మన్ పదవిలోకి వచ్చినప్పుడు తనకోసం ప్రత్యేకంగా చేయించుకున్న కురీ్చని కూడా కోటకు తీసుకుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment