చీపురుపల్లి, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని జైల్లో పెట్టేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని వైఎస్సార్‌సీపీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీ నాయన ఆరోపించారు. గజపతినగరంలో ఆదివారం జరిగిన జనభేరి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓట్లు అడిగేందుకు వస్తున్న టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబునాయుడుతో జై సమైక్యాంధ్ర అనిపించాలని సవాల్ విసిరారు.
టీడీపీ, కాంగ్రెస్‌లు ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల నుంచి వేరు చేయలేరన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు
Published Mon, Mar 31 2014 2:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement