బొత్స రాజకీయ జీవితం వైఎస్ పుణ్యమే
- వెఎస్సార్ సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయన
- కాబోయే సీఎం జగన్ : పెనుమత్స
చీపురుపల్లి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ ఎదుగుదలకు మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి కారణమని, అటువంటి నాయకుడ్ని బొత్స విమర్శించడం ఆయన నీచ బుద్ధికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బేబీనాయన అన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం సాయంత్రం గరివిడి పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. బొత్సకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్ దయతో తాను రాజకీయంగా ఎదగలేదని, గత ఎన్నికల్లో ఆయన ఫొటో లేకుండానే గెలిచానని అంగీకరించగలరా అని ప్రశ్నిం చారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ ఫొటో పెట్టుకుంటేనే ఈ నియోజకవర్గ ప్రజలు బొత్సను గెలిపించారని తెలిపారు.
వైఎస్సార్ దయ తో రాష్ట్రస్థాయి రాజకీయాలను నెరిపిన బొత్స ఆయన్నే విమర్శించే స్థాయి కి వచ్చారన్నారు. ఇలాంటి వ్యక్తులకు ప్రజలే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడి పదవిలో ఉండి కూడా ఆయన తోటపల్లి కాలువ పనులను పూర్తి చేయించలేకపోయారని, అంటే ఇక్కడి ప్రజలపై బొత్సకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. పా ర్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బడుగు, బలహీన వర్గాలు అభ్యున్నతి సాధించారని తెలిపారు. చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తోటపల్లి కాలువ పనులు పూర్తి చేయించి సాగునీరు అం దిస్తామని, గరివిడిలో ఫేకర్ సమస్య పరిష్కరించి, కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
జగన్ సీఎం కావడం ఖాయం
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబ శివరాజు అన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా ఒమ్మి, సతివాడ గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్ సంక్షేమ పథకాల అమలు జగన్‌మోహన్‌రెడ్డి పాలనతోనే సాధ్యమని చెప్పారు. అంతకుముందు పార్టీ విజయనగ రం ఎంపీ అభ్యర్థి బేబీనాయన మాట్లాడుతూ రాష్ట్ర రాజ కీయాల్లో జగన్‌మోహన్‌రెడ్డి మడమ తిప్పని నేత అని అన్నారు. పార్టీకి ఎనలేని ప్రజాదరణ ఉందని, వారే తమ ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నెల్లిమర్ల అసెంబ్లీ అభ్యర్థి సురేష్‌బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు.
చంద్రబాబు మాటలు నమ్మొద్దు
విజయనగరం మున్సిపాలిటీ/టౌన్: టీడీపీ అధినేత చం ద్రబాబు ఇస్తున్న హామీలను ప్రజలు నమ్మవద్దని వైఎ స్సార్ సీపీ విజయనగరం ఎంపీ బేబీనాయన కోరారు. విజయనగరం పట్టణంలోని గంట స్తంభం వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణమాఫీ అంటూ అనేక టక్కుటమారా, గజకర్ణ, గోకర్ణ విద్యలతో ముందుకు వస్తున్న బాబును, ఆ పార్టీ అభ్యర్థులను నమ్మొద్దని కోరారు. జగన్ సీఎం కావడం చారిత్రాత్మక అవసరమన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థ్ధిగా పోటీ చేసిన తాను కాంగ్రెస్ నాయకుల వెన్నుపోట్లు వల్లే నాలుగుసార్లు ఓటమి పాలయ్యాయని, చివరికి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందానని చెప్పా రు. ఎన్నికల్లో తనను, ఎంపీ అభ్యర్థి బేబీనాయనను ఫ్యా న్ గుర్తుపై ఓటేసి, గెలిపించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తాగునీరు, రోడ్లు, ఇళ్లు వంటి మౌలి క సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.