సినిమా చూపిస్తా... | Movie shows | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్తా...

Published Wed, Nov 5 2014 3:41 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

సినిమా చూపిస్తా... - Sakshi

సినిమా చూపిస్తా...

 ‘పవన్ కల్యాణ్ సినిమా మన ఏరియాలో ఎన్ని థియేటర్లకు ఇచ్చాడ్రా..?’ అంటూ ఓ అభిమాని ఉత్సాహం. ‘మహేష్ సినిమా ఎలా ఉందో.. ఏంటో..?’ అని మరో అభిమాని ఆరాటం. ‘చరణ్ సినిమా పక్క ఊళ్లో ఎన్ని థియేటర్లలో ఆడుతోంది..?’ అంటూ మరో ఫ్యాన్ ప్రశ్న. వీటన్నింటికీ ఒకే సమాధానం ‘నేటి తెలుగు సినిమా డాట్ కామ్’. బొబ్బిలిలోని ఓ ఉపాధ్యాయుడు రూపొందించిన ఈ వెబ్‌సైట్ ఇప్పుడు జిల్లాలోని సినీ ప్రియులకు మంచి సమాచారం అందిస్తోంది. వారానికి రెండు వేల మంది ఈ సైట్‌ను సందర్శిస్తున్నారు కూడా.
 
 బొబ్బిలి: ఏ ఊర్లో ఏ సినిమా ఆడుతోంది. ఏ థియేటర్‌లో ఎన్నింటికి సినిమా వేస్తారు. ఆ థియేటర్ల ఫోన్ నంబర్లు ఏంటి..? తాజాగా విడుదలైన సినిమా రివ్యూలు.. ఇలా అన్ని ఒకే చోట కనిపించే వెబ్ సైట్‌ను రూపొందించారు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వీరగంట అప్పారావు. దీని కోసం ‘సాక్షి’ దిన పత్రికలోని సినిమా పేజీ సాయం తీసుకున్నారు. బొబ్బిలి మండలం చింతాడ గ్రామానికి చెందిన అప్పారావు ప్రస్తుతం సీతానగరం మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు స్కూలు అసిస్టెంటుగా పని చేస్తున్నారు. పట్టణంలోని ఆళ్వారువీధిలో నివాసముం టున్న అప్పారావుకు చిన్న తనం నుంచి సినిమా అంటే చాలా ఇష్టం. స్వతహాగా ఆయన ఏఎన్‌ఆర్ అభిమాని. ఆ రోజుల్లో విడుదలైన సినిమాల గురించి పక్క జిల్లాల్లో టాక్ ఎలా ఉంది, కలెక్షన్లు, రికార్డుల గురించి పోస్టుకార్డుల ద్వారా వివరాలు తెప్పించునేవారు.
 
 ఇప్పుడు ఆధునిక ప్ర పంచంలో అన్ని స మాచారాలూ గుప్పిట్లోనే దొరికేస్తున్నా యి. అలా ఆధునికతను వినియోగించుకుని సినీ ప్రియుల కోసం  ‘నేటి తెలుగుసినిమా డాట్ కామ్’ను రూపొందించారు. ‘సాక్షి’ దినపత్రికల్లోని ప్రతీ జిల్లా ఎడిషన్‌లోని ఆయా జిల్లాల సిని మా విశేషాలను, థియేటర్ల వివరాలను ఇందులో ప్రచురిస్తున్నారు. వాటిని ఆధారంగా చేసుకొని అన్ని జి ల్లాల సినిమా పేజీ లన్నీ ఒకే దగ్గర వచ్చినట్లు వెబ్‌సైట్‌ను రూపొందించారు. 2012లో ఆయన డొమైన్ కొనుగోలు చేసి వెబ్‌సైట్ రూపకల్పన ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్ ద్వారా సినిమాలు, థియేటర్ల వివరాలతో పాటు టాక్, కలెక్షన్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
 
 ఇప్పటికే పలువురు సినీ పెద్దలు వెబ్‌సైట్‌ను చూసి అభినందించారని టీచర్ చెబుతున్నారు. వెబ్‌సైట్ రూపకల్పనను అప్పారావు ఆన్‌లైన్‌లోనే నేర్చుకున్నారు. ప్రస్తుతం వారానికి దాదాపు రెండు వేల మంది ఈ వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. విదేశాల్లోని ప్రవాసాంధ్రులు కూడా సైట్‌ను సందర్శిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement