పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు 14వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాలని మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి ఆదేశించారు.
బొబ్బిలి: పట్టణాల్లో తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకు 14వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాలని మున్సిపల్ ఆర్డీ ఆశాజ్యోతి ఆదేశించారు. పట్టణంలోని పార్కు అభివద్ధి పనులను ఆమె బుధవారం పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలన్నారు. పైపులైన్ లీకులను అరికట్టాలని సిబ్బందికి సూచించారు. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉంటే 14వ ఆర్థిక సంఘం నిధులతో పూర్తిచేయాలని కోరారు.
బొబ్బిలి మున్సిపాలిటీలో చేపడుతున్న అభివద్ధి పనులు మిగతా మున్సిపాలిటీలకు ఆదర్శంగా ఉన్నాయన్నారు. శ్మశానాల అభివద్ధి, ప్రధాన కూడళ్లలో రహదారుల అభివద్ధి చేసి ప్రజలకు ఉపయోగ పడేలా సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. పార్కు వద్ద వాకింగ్ ట్రాక్, బోటు షికారు, స్కేటింగ్ స్థలం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఆహ్లాదం కలుగుతుందన్నారు. ప్రస్తుతం చేపడుతున్న అభివద్ధి పనులను చైర్ పర్సన్ తూముల అచ్యుతవల్లితో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హెచ్ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.