నిక్షేపంలా ఉన్న హాస్టళ్లను ఎత్తేయాలని సర్కారు యోచించింది. ఇందుకోసం
ఉత్తర్వులు విడుదల చేయకున్నా... మౌఖికంగా ఎవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలిచ్చింది. అందులో చదువుతున్న పిల్లల్ని ఏంచేయాలన్నదానిపై స్పష్టత కనిపించలేదు. ఇప్పుడు ఆ పిల్లలు ఎక్కడ చదవాలన్నదానిపై సందిగ్ధం నెలకొంది. ఇలా పేదపిల్లల చదువులతో సర్కారు ఆటల్ని అంతా ఖండిస్తున్నారు.
బొబ్బిలి : జిల్లాలోని 13 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఆయా హాస్టళ్లలో ఎవరినీ చేర్చుకోవద్దంటూ మౌఖికంగా ఆదేశాలిచ్చింది. కానీ ఇప్పటికీ ఉత్తర్వులైతే అధికారికంగా విడుదల కాలేదు. ఇదే ప్రస్తుతం అక్కడి విద్యార్థుల చదువులను ప్రశ్నార్థకం చేస్తోంది. హాస్టల్ మూసేస్తే ఇప్పటివరకూ అందులో ఉన్న పిల్లల్ని ఎక్కడకు తరలించాలో తెలీక వార్డెన్లు సతమతమవుతున్నారు. ఇక్కడినుంచి తరలించాక వారికి పాఠశాలలు అందుబాటులో ఉంటాయో లేవోనని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
క్రమేపీ హాస్టళ్ల మూసివేత
ఇప్పటికే గత ఏడాది జిల్లాలో మొత్తం 11 హాస్టళ్లను మూసివేశారు. ఈ ఏడాది 13 వసతి గృహాలను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలిన వాటిని రెండేళ్లలో మూసేయాలని అప్పుడు సర్కారుకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఈ ఏడాది ఎత్తేవేసే వసతి గృహాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఏ క్షణాన్నైనా అదేశాలు వస్తే మధ్యలో పాఠశాలలు మారినప్పుడు ఇబ్బందులు వస్తాయని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.
సందిగ్ధంలో నాలుగో తరగతి ఉద్యోగులు
ప్రతీ వసతి గృహంలో నలుగురు ఉద్యోగులు ఉంటారు, వారిలో మేట్రిన్, వార్డెన్‌లు ఉద్యోగులు కాగా, మిగిలిన ముగ్గురు ఔట్ సోర్సింగు
సందిగ్ధంలో చదువులు
Published Wed, Jul 13 2016 11:27 PM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement
Advertisement