‘స్వచ్ఛ భారత్’ నిర్మాణానికి కృషి | swachh bharat Ashok Gajapathi Raju Construction work | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ భారత్’ నిర్మాణానికి కృషి

Published Mon, Nov 3 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

‘స్వచ్ఛ భారత్’ నిర్మాణానికి కృషి

‘స్వచ్ఛ భారత్’ నిర్మాణానికి కృషి

ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్

బొబ్బిలి : ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ నిర్మాణానికి కృషి చేయాలని కేంద్రమంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్  సభలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి దేశంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు.విద్యార్థు లు, యువత దీనిపై దృష్టిసారిస్తే స్వచ్ఛభారత్ నిర్మాణం సాధ్యమని చెప్పారు. ఫొటోలు, పబ్లిసిటీ కోసం కాకుండా సమాజాభివృద్ధికి కృషి చేయాల ని చెప్పారు. మంత్రి మృణాళిని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ నిర్మాణానికి కృషి చేయాలన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ స్వచ్ఛ భార త్ అందరి బాధ్యత అని తెలిపారు.
 
 అనంతరం అంతా స్వచ్ఛ భారత్‌పై ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు టీటీడీ కల్యాణ మండపం వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం వేణుగోపాలస్వామి ఆల యం నుంచి చీపర్లు పట్టి చెత్తాచెదారాన్ని ఊడ్చి కోట జంక్షన్ వద్దకు ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా అభ్యదయ, పద్మాలయ నృత్య సంస్థ విద్యా ర్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అలాగే స్థానిక టీడీపీ కార్యాలయంలో తుపా ను బాధితులకు దుస్తులు, ఆహార సామగ్రిని కేంద్రమం త్రి చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుమ్మడి సంధ్యారాణి, ఆర్‌పీ భంజ్‌దేవ్, ఎమ్మెల్యే మీసాల గీత,ఐవీపీ రాజు,తెంటు లక్ష్మునాయుడు, తూముల భాస్కరరావు, తూముల అచ్యుతవల్లి, తదితరులు పాల్గొన్నారు.
 పర్యాటక రంగం అభివృద్ధి చెందాలి
 
 భారతదేశం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందాలని, అప్పుడే విమానరంగం అభివృద్ధి చెందుతుందని కేంద్ర విమానయానశాఖామంత్రి అశోక్‌గజపతిరాజు తెలిపా రు. ఆదివారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడా రు. దేశంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి 400 విమానాశ్రయాలు ఉన్నాయని, వాటిలో 120 వరకు ప్రస్తుతం వాడుకలో ఉన్నాయని తెలిపారు. 70 వరకు విమానాశ్రయాలు బాగా రద్దీగా ఉన్నాయని, కొత్త విమానాశ్రయా లు ఏర్పాటు చేయడమంటే అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రవాణా విమానాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. జీరో బేస్‌డ్ ఖాతాలు బాగా ప్రజలు తెరిచారన్నారు. విశాఖ రైల్వేజోన్ విషయంపై విలేకరు లు ప్రశ్నించగా విజయవాడ, విశాఖలో ఏర్పాటు చేయాలని, రాష్ట్ర విభజన సమయంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోవడం అన్యాయమన్నారు. ఏపీ అంతా ఒకే జోన్ చేయడానికి యత్నిస్తున్నామన్నారు. బాడంగి విమానాశ్రయంపై ప్రశ్నించగా దీని వల్ల ఉపయోగం లేదన్నారు. స్విస్‌బ్యాంకు ఖాతాలలో వివరాలు తీసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్నేహభావంతో ఉండడంతో అభివృద్ధి సాధ్యమని తెలిపారు.
 
 కొత్తపెంటలో పంట నష్టం పరిశీలన
 బొబ్బిలి రూరల్ : కొత్తపెంటలో తుపానుకు పాడైన పం టలను కేంద్రమంత్రి పరిశీలించారు. రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రాంతంలో పంట ఎక్కువగా పోయిందో తహశీల్దార్ బి. మాసిలామణి మంత్రికి వివరించారు. వెంటనే మంత్రి .. జేసీ రామారావును పిలిచి ఈ ప్రాంతంలో పంట నష్టాలను గుర్తించి తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించారు.  
 
 గత ప్రభుత్వం సారా వ్యాపారంతోనే పాలించింది
 పార్వతీపురం : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సారా వ్యాపారానికే ప్రాధాన్యత ఇచ్చి ందని కేంద్రమంత్రి అశోక్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 11, 12 వార్డుల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన జన్మభూమి సభలో ఆయ న మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన బా గుందన్నారు. ఈ సందర్భంగా తుపాను బాధితులకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ.50 వేలు చెక్కు ఇచ్చిన డా. వివేక్, డా. పద్మజలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణ, డిసీఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షు డు కళింగ మల్లిబాబు, పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement