
సాక్షి, బొబ్బిలి రూరల్: దాంపత్య జీవితం విఫలమైందన్న బాధతో ఓ గిరిజన మహిళ తన ఇంట్లో ఫ్యాన్‌కు చీర కొంగుతో ఉరి వేసుకొని మృతి చెందింది. ఎస్‌ఐ చదలవాడ సత్యనారాయణ తెలిపిన వివరాలు.. బొబ్బిలి మండలం గోపాలరాయుడిపేట పంచాయతీ అక్కేనవలస గ్రామానికి చెందిన సీదరపు లక్ష్మి (35) శనివారం మధ్యాహ్నం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. లక్ష్మీకి అదే గ్రామానికి చెందిన డొంబిదొరతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది.
వీరికి పదేళ్ల భాస్కరరావు, ఆరేళ్ల అవిత, మూడేళ్ల కిశోర్ సంతానం ఉన్నారు. దొర పదేళ్ల క్రితం రాజేశ్వరి అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని, ఆమెకు ఏడేళ్ల స్వప్న, ఐదేళ్ల బుజ్జి సంతానం ఉన్నారన్నారు. తన భర్త రెండో పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పిల్లలతో వేరుగా జీవిస్తున్న లక్ష్మి కలత చెంది, జీవితంపై విరక్తితో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఆయన తెలిపారు. గ్రామానికి చెందిన పెద్ద గెంబలి సుందరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment