
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): కళ్లకురుచి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలో నవవధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. చిరుపాక్కం గ్రామానికి చెందిన కలయమూర్తి కుమార్తె కనకవల్లి (20). ఈమెకు పచ్చముత్తూ కుమారుడు సుగుణేష్(22)తో మూడు నెలల క్రితం వివాహమైంది. ఈక్రమంలో గత 3 రోజుల క్రితం చిరుపాక్కంలో ఉన్న తన ఇంటికి తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో పని విషయంగా కనకవల్లి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న కనకవల్లి ఫ్యానుకు ఉరేసుకున్న ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన తల్లిదండ్రులు, బంధువులు విలపించారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కనకవల్లి మృతదేహాన్ని కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి వరకట్నం వేధింపుల కారణంగా ఆత్మ చేరుకున్నారా..? లేదా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంతో విచారణ చేస్తూ ఉన్నారు. తిరుకోవిలూరు ఆర్డీఓ విచారణను పర్యవేక్షిస్తున్నారు.
చదవండి హైదరాబాద్‌లో అమానుషం.. యువతి బట్టలిప్పి వివస్త్రను చేసిన కీచకుడు
Comments
Please login to add a commentAdd a comment