ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): తిరుపూర్ జిల్లా తారాపురం ప్రాంతంలో బుధవారం రాత్రి వివాహేతర ప్రేమజంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. తారాపురంలోని పూవాడిపాలెంకు చెందిన కార్మికుడు మణికంఠన్‌కు భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ భార్య మారి యమ్మాల్ (40) దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. గత మూడు నెలల క్రితం నటరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు.
ఈ క్రమంలో మారి యమ్మాల్‌కు మణికంఠన్‌కు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న బంధువులు వారిని మందలించారు. రెండు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిన వారిద్దరు అదృశ్యమయ్యారు. దీంతో బంధువులు వారి కోసం గాలించారు. ఈ క్రమంలో బొమ్మనాయకన్ పట్టి, పవన విద్యుత్ కేంద్రం ప్రాంతంలో ఒక జంట మృతి చెందినట్లు బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పరిశీలించగా చనిపోయిన వారు మారియమ్మాల్, మణికంఠన్‌గా గుర్తించారు. వీరు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి
Comments
Please login to add a commentAdd a comment